దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల్లో డెంగ్యు ఒకటి. డెంగ్యు వైరస్ సంక్రమణ వల్ల వచ్చే విష జ్వరం. ఈ సమాచారం మనందరికి ఇప్పటి వరకు తెలిసిందే. అయితే ముల్లును ముల్లుతోనే తియ్యాలి అనే సామెతను బాగా అమలు చేద్దామని భావించిన ఇండోనేషియా శాస్త్రవేత్తలు ఈ దోమలకు విరుగుడుగా జన్యు మార్పులు చేసిన కొత్త దోమలను ప్రయోగశాలల్లో పుట్టించి వదలాలని భావించారు.
డెంగ్యును వ్యాపింపచేసే ఏడిస్ ఈజిప్టీ దోమల్లో ఇది వరకు వొల్బాచియా అనే ఒక బ్యాక్టీరియాను కలిగి ఉండేవి. ఈ బ్యాక్టీరియా ఆ దోమల్లో వైరస్ పెరగకుండా నిరోధించేది. అలాంటి బ్యాక్టీరియా కలిగిన దోమలను జన్యుమార్పిడి ద్వారా ల్యాబ్ లలో తయారు చేసి డెంగ్యు వ్యాపిస్తున్న ప్రాంతాల్లో వదలలాని ఇండోనేషియా ప్రభుత్వం భావించిందట. అయితే, దీనిపై వ్యతిరేకత ఏర్పడటం, పలు అధ్యయనాలు కూడా అలాంటివి వద్దని చెప్పడంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రయత్నాలు మానుకుంది.
బాలిలో డెంగ్యు వ్యాప్తిని అరికట్టేందుకే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టామని, దీన్ని తాత్కాలికంగా మాత్రమే నిలిపామని ఇండోనేషియా ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజల్లో పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే దీన్ని అమలు చేస్తామన్నారు. వోల్బాచియా అనేది దోమలు, ఫ్రూట్ ఫ్లైస్, చిమ్మటలు, డ్రాగన్ ప్లైస్, సీతాకోక చిలకల వంటి 60 శాతం కీటకాల్లో అభివృద్ధి చేందే సాధారణ బ్యాక్టీరియా. అయితే, ఈ బ్యాక్టీరియా డెంగ్యు వ్యాధిని వ్యాపింపజేసే ఏడిస్ ఈజిప్ట్ దోమల్లో లేదు.
వరల్డ్ మస్కిటో ప్రోగ్రాం అనే ఎన్జీఓ డెంగ్యు వాహకాలుగా ఉన్న దోమలతో.. ల్యాబ్‌లో వోల్బాచియా బ్యాక్టీరియా ఇంజెక్ట్ చేసిన దోమలు జతకట్టేలా చేయ్యడం ద్వారా మంచి దోమలను ఉత్పత్తి చేయాలని భావించింది. ఈ మేరకు 8.6 మిలియన్ల జనాన్ని కవర్ చేస్తూ 12 దేశాల్లో ఇటువంటి పైలట్ ప్రొగ్రామ్‌ను రూపొందించినట్టు నివేదికలు తెలుపుతున్నాయి. గజ మడ యూనివర్శిటీలో 2011లో ఈ అధ్యయనం ప్రారంభమైంది. వొల్బాచియా ట్రీట్మెంట్ పొందిన కమ్యూనిటీల్లో డెంగ్యు వ్యాప్తి 77 శాతం వరకు తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి.
డెంగ్యూను ఎదుర్కొనేందుకు వొల్బాచియా ట్రీట్మెంట్ చేసిన దోమలను వ్యాప్తి చేయడమనేది మంచి ఆలోచన అని ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా వెల్లడించారు. ఇంకా ప్రయోగదశలోనే ఉన్న ఈ ప్రణాళిక విజయవంతమైతే డెంగ్యు నివారణలో అదొక మైలు రాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు. అయితే, ఈ దోమలు పూర్తిస్థాయిలో సురక్షితమని తేల్చిన తర్వాతే.. అమలు తేవాలని, లేకపోతే అది కొత్త సమస్యలకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.
డెంగ్యు వ్యాప్తి గత పదేళ్లలో బాగా పెరగిందని, ప్రపంచ జనాభాలో సగం మంది ప్రమాదం అంచున ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ప్రతి సంవత్సరం 100-400 మిలియన్ల డెంగ్యూ ఇన్ఫెక్షన్లు నమోదు అవుతున్నాయని పేర్కొంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read : శరీరాన్ని టార్చర్ చేయకూడదు - నాని ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనట