భారతదేశ భోజనాల్లో నెయ్యి స్థానం ప్రముఖమైనది. ఇంటివి విశిష్ఠ అతిథులు ఎవరు వచ్చినా వారికి కచ్చితంగా నెయ్యితో వండిన వంటకాలనే వడ్డిస్తారు.  పప్పు - నెయ్యి కాంబినేషన్ అందిరకీ ఫేవరేట్ ఆహారం. ముఖ్యంగా ఆవు నెయ్యిని వాడే వారి సంఖ్య చాలా ఎక్కువ. నెయ్యిని ఆహారానికి జతచేర్చి వండడం వల్ల దానికి మంచి రుచితో పాటూ, సువాసన వస్తుంది. నెయ్యి తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నెయ్యి అధికంగా తింటే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు కూడా నెయ్యిని తినకూడదు.


నెయ్యి అధికంగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చేరిపోతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు ఒక స్పూను కన్నా ఎక్కువ నెయ్యి తినకూడదు. ముఖ్యంగా ఊబకాయం, పీసీఓడీ వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలు నెయ్యిని దూరం పెట్టాలి. అధిక బరువుతో ఉన్న మగవారు కూడా నెయ్యిని తినకూడదు. నెయ్యి ఆ రెండు సమస్యలు ఇంకా పెంచుతుంది.మనం తిన్న ఆహారం నుంచి శరీరం కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. దానికి నెయ్యి అధికంగా తినడం వల్ల ఏర్పడే కొవ్వు కూడా జత చేరితే సమస్య పెరిగిపోతుంది. వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎవరైతే గుండె జబ్బుల బారిన పడి తేరుకున్నారో, అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు నెయ్యికి దూరంగా ఉంటే ఉత్తమం. నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు రక్తపోటును పెంచేస్తాయి. జీర్ణాశయ అనారోగ్యాలు ఉన్నవారు కూడా నెయ్యిని తినకూడదు. 


30 ఏళ్ల వయసు దాటిని వారంతా నెయ్యిని తక్కువగా తినాలి. వారిలోనే కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఎక్కువ. రోజుకో స్పూను నెయ్యి తింటే మేలే జరుగుతుంది, కానీ అంతకుమించి తింటే మాత్రం అనర్థాలు తప్పవు. ఒక స్పూను నెయ్యి తింటే 7.9 గ్రాముల సంతృప్త కొవ్వు లభిస్తుంది. 112 క్యాల‌రీలు కూడా లభిస్తాయి. ఒక మనిషి రోజుకు తీసుకునే ఆహారంలో కొవ్వు 56 నుంచి 78 గ్రాములకు మించకూడదు. నెయ్యి ఎక్కువ వేసుకుని తింటే దీని ద్వారానే అధిక కొలెస్ట్రాల్ చేరుతుంది. ఇక మిగతా ఆహారంలో ఉన్న కొవ్వును కూడా లెక్కేస్తే అధిక మోతాదులో కొవ్వు శరీరంలో చేరే అవకాశం ఉంది.  కాబట్టి అధిక బరువు సమస్యతో బాధపడేవారు నెయ్యిని దూరంగా పెట్టాలి.


Also read: చర్మం మెరిసిపోవాలంటే రోజూ తినాల్సిన ఆహారాలు ఇవిగో



Also read: సోమవారాలే అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం, ఎందుకో తెలుసా?




































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.