ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేమించే అత్యంత రుచికరమైన పండు అరటిపండు. తక్షణ శక్తిని అందిస్తాయి. బరువు తగ్గడం దగ్గర నుంచి గుండె ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే అనేక ముఖ్యమైన పోషకాలతో లోడ్ చేయబడి ఉంటుంది. అందరికీ అందుబాటు ధరలో ఉండటం వల్ల వాటిని తినేందుకు ఇష్టం చూపిస్తారు. ఇవి తినడం వల్ల పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే బ్రేక్ ఫాస్ట్ గా అరటి పండు తీసుకుంటారు. మరి కొంతమంది పాలు-అరటిపండు కలిపి తీసుకుంటారు. ఈ రెండు పద్ధతులు ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా శరీరానికి హాని చేస్తాయి.


బ్రేక్ ఫాస్ట్ గా అరటి పండు ఎందుకు వద్దు?


అరటిపండులో పొటాషియం, ఫైబర్, విటమిన్లతో పాటు పిండి పదార్థాలు, సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిల్ని కూడా పెంచుతుంది. ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్ బాధపడే వాళ్ళకి ఇది చాలా ప్రమాదకరం. కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాన్ని అల్పాహారంగా తినడం వల్ల ఆకలి స్థాయిలని పెంచుతుంది. దీర్ఘకాలికంగా బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి.


అరటిపండు ఇలా తినండి


అరటిపండ్లు అల్పాహారంగా అనువైన ఆహారం కానప్పటికీ ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలు పిండి పదార్థాలు, చక్కెరను సమతుల్యం చేస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర ఆహారాల నుంచి మాక్రోన్యూట్రియెంట్స్ అరటిపండు తినడం వల్ల వచ్చే నష్టాలని భర్తీ చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేలా చేస్తాయి. మీడియం సైజు అరటి పండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీన్ని గిన్నె ఓట్స్ చేర్చి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపరచమే కాకుండా పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది.


అరటిపండుతో గుండెకి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్ జత చేసి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. ఆకలి నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే పీనట్ బటర్ లేదా ఉడికించిన గుడ్డుతో కలిపి అరటిపండు తీసుకోవచ్చు. అలాగే వైద్యుల అభిప్రాయం ప్రకారం ఎప్పుడు ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు. పోషకాలు ఉన్నప్పటికీ అవి తీవ్రమైన జీర్ణ సమస్యల్ని కలిగిస్తాయి. అందులోని యాసిడ్ కంటెంట్ తగ్గించుకోవడం కోసం బాదం, వాల్ నట్ వంటి డ్రైఫ్రూట్స్ తో కలిపి తీసుకోవచ్చు. మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే రక్తంలో కాల్షియం, మెగ్నీషియం మధ్య అసమతుల్యత ఏర్పడేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది హృదయనాళ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే రోజుకి ఒకటి లేదా రెండు అరటి పండ్లకి మించి తీసుకోకపోవడమే మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: అమ్మాయిలూ మీరు ఇలా నిద్రపోతే మొటిమలు రావడం ఖాయం