Sunscreen Application : సన్ స్క్రీన్‌ని ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా? స్కిన్ హెల్త్‌కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
సన్‌స్క్రీన్‌ని సరిగ్గా అప్లై చేయకుంటే అప్లై చేసి వేస్ట్. అలాగే సరైనది ఎంచుకోకున్నా కూడా దాని ఫలితాలు పొందలేరు. మరి సన్‌స్క్రీన్‌ని ఎలా అప్లై చేసుకోవాలో.. ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.
సన్‌స్క్రీన్‌ని అప్లై చేయాలనుకుంటే కనీసం ఎండలోకి వెళ్లే 15 నుంచి 30 నిమిషాల ముందే దానిని అప్లై చేయాలి. ఇది స్కిన్‌ని అబ్జార్బ్ చేస్తుంది. వెంటనే బయటకు వెళ్తే అప్లై చేసుకున్నా మంచి ఫలితాలుండవు.
సన్‌స్క్రీన్‌ని మరీ చిన్న మోతాదులో కాకుండా.. మీ పూర్తి మొహానికి, మెడకు సరిపోయేంత అప్లై చేసుకోవాలి. లేదంటే మీరు టూ ఫింగర్స్పై ట్యూబ్ తీసుకుని దానిని అప్లై చేయాలి.
సన్‌స్క్రీన్ కేవలం ముఖానికే అనుకుంటారు. కానీ ఎండకు ఎక్స్పోజ్ అయ్యే ప్రతి భాగానికి సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ముఖ్యంగా బీచ్‌కి వెళ్లినప్పుడు పూర్తి శరీరానికి దీనిని అప్లై చేసుకోవాలి.
అలాగే SPF 30, SPF 50 ఉండే సన్స్క్రీన్లను మాత్రమే ఎంచుకోవాలి. ఇవి స్కిన్ డ్యామేజ్ కాకుండా పూర్తి రక్షణను ఇస్తాయి. అందుకే వీటిని చెక్ చేసుకుని కొనుక్కోవాలి.
కనీసం 2 గంటలకోసారైనా సన్‌స్క్రీన్ అప్లై చేస్తే మంచిది. ముఖ్యంగా స్విమ్మింగ్ చేసేవారు.. ఎక్కువగా చెమటతో ఇబ్బంది పడేవారు.
బయటకు వెళ్తేనే కాదు.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్‌ని కచ్చితంగా అప్లై చేయాలి. చాలామంది ఇంట్లో ఉంటే దీనిని వాడరు. కానీ ఇంట్లో ఉన్నకూడా హీట్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుందట.