అన్నా షెపర్డ్... ప్రస్తుతం ఈమె వయసు 30. స్వదేశం హంగేరీ. అక్కడ వారి జుట్టు నలుపు, బ్రౌన్ రంగుల్లో మాత్రమే ఉంటుంది. ముసలి వయసు వచ్చాకే జుట్టు తెల్లబడుతుంది. కానీ అన్నాకు 13 ఏళ్లకే జుట్టు తెల్లబడింది. దీంతో ఆమె తోటి వారి నుంచి బంధువుల నుంచి చాలా మాటలు పడాల్సి వచ్చింది. వారి పదునైన మాటలు పసి మనసును చాలా కష్టపెట్టాయి. కానీ ఆమె తన జుట్టుకు రంగు వేయడం లాంటివి ఇష్టపడలేదు. జుట్టును సహజంగానే ఆరోగ్యంగా పెంచాలనుకుంది. అప్పటి నుంచి జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అప్పట్లో ఆమె జుట్టును చూసి నవ్వినవాళ్లు ఇప్పుడు ఆమె కురుల అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అయిదడుగుల పొడవైన జుట్టుతో రియల్ లైఫ్ రెఫ్యూంజెల్‌లా ఉంది.
తన జుట్టు ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో పోస్టు చేస్తుంది అన్నా. ఆమెకు 17,500 మంది ఫాలోవర్లు ఉన్నారు. వారంత ఆ జుట్టు ఫోటోలు మెచ్చిన వారే. ఇంత పెద్ద జుట్టు ఉన్నా కూడా అన్నా నెలకోసారి మాత్రమే తలకు స్నానం చేస్తుంది. అంతేకాదు కొన్ని రోజుల పాటూ దువ్వుకోకుండా అలాగే ఉంటుంది. రోజూ జడ వేసుకోవడం కష్టంగా ఉంటుందట, అందుకే ఒకసారి జడవేస్తే కొన్ని వారాల పాటూ విప్పకుండా వదిలేస్తుంది. చివరిసారిగా తాను జుట్టు కట్ చేయించుకున్నది పద్నాలుగేళ్ల వయసులో. అప్పట్నించి పెంచుతూనే ఉంది. ఆమె అందమైన కురులను చూసి మీరు తరించండి.
[insta]
Also read: టాటూ వేయించుకుంటున్నారా? అయితే వేయించుకోవడానికి ముందు, తరువాత ఈ పనులు చేయకూడదు