How to keep hygiene of private parts Male and Female : ప్రతి మనిషికి లైంగిక చర్య అనేది అవసరం. ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. అయితే మంచిది కదా అని ఎలా పడితే అలా ఈ చర్యలో పాల్గొంటే.. లైంగికంగా సంక్రమించే ఇన్​ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది. మనం పరిశుభ్రంగా ఉండాలనే ఎదుటివారికోసం కాదు.. మన ఆరోగ్యం కోసం అనేది గుర్తించుకోండి. లైంగిక పరిశుభ్రత అవసరమైనా.. దీని గురించి ఎక్కువమంది చర్చించరు. 


సెక్స్ ఎడ్యుకేషన్ (Sex Eductaion)​లో ఇది కూడా ఓ భాగమేనని గుర్తించి.. లైంగిక పరిశుభ్రతపై కనీస అవగాహన కలిగి ఉండాలి. మీరు రెగ్యూలర్​గా సెక్స్​లో పాల్గొంటారా? అయితే మీరు ఒక్కసారైనా అసౌకర్యాన్ని లేదా.. ఇన్ఫెక్షన్​కు గురయ్యే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ రకమైన ఇబ్బందికి లోనయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియల్ వాగినోసిస్ వంటి చిన్న చిన్న సమస్యలతోపాటు.. ఎయిడ్స్ వంటి జీవితకాల వ్యాధులు సంక్రమిస్తాయి. ముఖ్యంగా మీరు ఎక్కువ భాగస్వాములతో లైంగికంగా కలిస్తే వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే లైంగిక చర్యల్లో రెగ్యూలర్​గా పాల్గొనే వ్యక్తి కొన్ని పరిశుభ్రత చిట్కాలను పాటించాలి. మీ ప్రైవేట్ భాగాలను ఇన్ఫెక్షన్ల నుంచి ఎలా సహజంగా కాపాడుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.


షేవ్ చేయాలా వద్దా?


స్త్రీ, పురుషులకు ఆ ప్రాంతంలో జుట్టు ఉంటుంది. ఇది జెర్మ్స్, బ్యాక్టీరియాను వ్యాపింపజేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మీ ప్రైవేట్ ప్రాంతాన్ని రక్షించుకోవాలనుకుంటే మీరు షేవింగ్ చేయొచ్చు. అయితే మీరు మీ హెల్త్ కోసం అక్కడి జుట్టును తొలగించుకోవచ్చు కానీ.. అందంగా కోసం దానిని రిమూవ్ చేయకూడదంటున్నారు నిపుణులు. పైగా అక్కడ షేవ్ చేయకపోవడమే మంచిదని.. జెర్మ్స్, బ్యాక్టిరీయా వ్యాప్తి చెందకుండా.. ఆ ఏరియాలోని హెయిర్​ను ట్రిమ్ చేయాలి అంటున్నారు. షేవ్ చేస్తే అక్కడ ఉండే పొర తొలగిపోయి.. అసౌకర్యం పొందుతారని చెప్తున్నారు.  


ఆ ప్రదేశాలలో నో సెక్స్..


కోరిక కలిగినప్పుడు లైంగిక చర్యలో పాల్గొంటే మంచిదే కానీ.. ఎక్కడపడితే అక్కడ దీనిని చేయకూడదు. ఫాంటసీల కోసం బీచ్​లలో కొందరు దీనిని ప్లాన్ చేస్తారు. అయితే అలాంటి ప్రదేశాల్లో ఈ చర్యలో పాల్గొనకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే తెలియకుండానే.. ఇసుక, దుమ్ము రేణువులు మీ శరీరంలోకి చొరబడే ప్రమాదముంది. ఇది మీకు అసౌకర్యాన్ని, ఇన్​ఫెక్షన్లను కలిగిస్తుంది. 
మొత్తానికి చెప్పేది ఏంటంటే.. బహిరంగంగా ఉండే ప్రదేశాలలో.. మురికిగా ఉండే ప్రాంతాల్లో ఈ చర్యలో పాల్గొనక పోవడమే మంచిది. గాలి, మురికి మీకు తెలియకుండానే ఇన్​ఫెక్షన్ల బారిన పడేస్తాయి కాబట్టి.. బహిర్గత ప్రదేశాల్లో దీనికి దూరంగా ఉండడమే మంచిది. 


డెంటల్ కేర్..


లైంగిక పరిశుభ్రతలో నోటి శుభ్రత కచ్చితంగా ఉంటుంది. ఎలాంటి రొమాంటిక్ మూడ్ అయినా.. ముద్దు నుంచే మొదలవుతుంది. ఇదే కీలకమైనా.. చాలా మంది దీనిపై దృష్టి పెట్టరు. అదర చుంబనాలు బ్యాక్టీరియాను బదిలీ చేస్తాయి. కాబట్టి సెక్స్​కి ముందు, తర్వాత కూడా మౌత్ వాష్ చేయండి. దంతాలను తరచుగా బ్రష్ చేయండి. ఫ్లాస్ చేయండి. అధిక ఆమ్ల కలిగిన ఫుడ్స్​కు దూరంగా ఉండండి. చూయింగ్ గమ్, మౌత్ ఫ్రెషనర్​లు కూడా నోటిలోని బ్యాక్టీరియాను తగ్గిస్తాయి.


యోని శుభ్రత..


అమ్మాయిలు యోని శుభ్రతలో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీరు ఎంత పరిశుభ్రంగా దానిని చూసుకుంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది. కాబట్టి సెక్స్ పాల్గొనే ముందు, తర్వాత కూడా మీరు యోనీని శుభ్రం చేసుకోవాలి. మీ సహజ pH బ్యాలెన్స్​కు భంగం కలిగించని ఉత్పత్తులను ఎంచుకోవాలి. సంభోగం తర్వాత కచ్చితంగా మీరు ఆ ప్రాంతాన్ని క్లీన్ చేసుకోవాలి. లేదంటే.. బ్యాక్టీరియా చాలా త్వరగా వృద్ధి చెందుతుంది. కాబట్టి రెగ్యూలర్​గా మీ జననాంగాలను గోరువెచ్చని నీటితో కడగండి. లోదుస్తులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. వీటిని మీరు పాటిస్తే.. రెగ్యూలర్​గా వచ్చే ఇన్​ఫెక్షన్ల నుంచి మీ ప్రైవేట్ ప్రాంతాలను కాపాడుకోవచ్చు.


Also Read : మెరుగైన లైంగిక జీవితం కోసం ఒక్క అలవాటు వదిలేస్తే చాలట