IND vs AUS World Cup 2023 Final:  దేశవ్యాప్తంగా ప్రపంచకప్  ఫైనల్  ఫీవర్ కనిపిస్తోంది. అహ్మదాబాద్‌(Ahmedabad)లో అయితే  ఎక్కడ చూసినా  క్రికెట్ అభిమానులు భారత జెర్సీల్లో దర్శనమిస్తున్నారు.  రోడ్లపైకి  భారత జెండాలతో వచ్చి రోహిత్(Rohit)  సేన విజయం సాధించాలని కేరింతలు కొడుతున్నారు. మరోవైపు స్టేడియంలో  పోరును వీక్షించేందుకు  దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు అహ్మదాబాద్‌కు  చేరుకుంటున్నారు. సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) గారాలపట్టి సారా టెండూల్కర్కూ(Sara tendulkar)డా అహ్మదాబాద్‌ చేరుకుంది.  వచ్చేశా అంటూ ఉదయపు నీరెండలో నిలబడి మురిసిపోతున్న ఓ పిక్ పెట్టి శుభమన్ గిల్ కి ఆల్ ది  బెస్ట్ కూడా చెప్పింది. ప్లే వెల్ అంటూ పోస్ట్ చేసింది. 


సోషల్ మీడియాలో గిల్, సారా టెండూల్కర్ ఒకరినొకరు ఫాలో కావటం, పోస్టులకు కామెంట్స్ కూడా పెడుతూ రావటంతో గతేడాది క్రితం వరకు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌(Sara Ali Khan)తో శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు కొత్త ప్రచారం తెరిపైకి వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి ఓ కాఫీ షాప్‌లో కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. దాంతో సారా టెండూల్కర్-శుభ్‌మన్ గిల్ లవ్‌కు సంబంధించిన గాసిప్స్‌కు బ్రేక్ పడింది. కొత్త గాసిప్ మొదలయ్యింది. అయితే తరువాత మళ్ళీ సారా టెండూల్కర్-శుభ్‌మన్ గిల్ ఇద్దరు కలిసిపోయారన్న వార్తలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ప్రపంచ కప్ మ్యాచ్ లకి సారా హాజరు  అవ్వటం, గిల్ ఫోర్ లు, సిక్స్ లు కొట్టిన ప్రతిసారీ  గట్టిగా చప్పట్లు కొడుతూ అతన్ని ఎంకరేజ్ చేయటం మీడియా కంట పడింది. ఇంకేముంది  ఈ వీడియో క్లిప్ మరోసారి సోషల్ మీడియాను దున్నేసింది.  ఈ ప్రపంచ కప్ లో  భారత్ ఆడుతున్న ప్రతి మ్యాచ్ కి  క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ హాజరైంది. మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ టీమిండియాకు మద్దతు తెలిపింది. గిల్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోయింది. 


సరిగ్గా ఇదే సమయంలో గిల్ గర్ల్ ఫ్రెండ్ అంటూ రుమర్ల పాలైన సారా అలీఖాన్‌ కాఫీ విత్ కరణ్ జోహార్‌ షోకుహాజరైంది. మీరు శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్‌లో ఉన్నారా? అంటూ సారాను కరణ్ అడిగారు. దీనికి నవ్వుతూ సమాధానమిచ్చింది సారా అలీ ఖాన్. ఆ సారాను నేను కాదంటూ చెప్పేసింది. అందరూ నా పేరు వెనకాలే పడ్డారంటూ నవ్వేసింది.  


అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో..రెండుసార్లు టోర్నీ విజేత భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.మధ్యాహ్నం  రెండు గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ కోసం కోట్లాది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ పోరులో..... కచ్చితంగా విజయం  సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 2003 ప్రపంచకప్‌ ఫైనల్ పరాభవానికి  బదులు తీర్చుకోవాలని కసిగా కనిపిస్తోంది. ఈ టోర్నీ మొత్తం ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ ప్రణాళికబద్దంగా ఆడిన భారత్ ఫైనల్‌లోనూ అదే కొనసాగించాలని భావిస్తోంది. ఫైనల్  మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్ మరోసారి శుభారంభం ఇవ్వాలని కోహ్లీ అదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.