సత్తు ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక పప్పులు, తృణధాన్యాలతో చేసిన పొడి. భారతదేశంలో విస్తృతంగా వినియోగించబడుతుంది. ఇది పేదవాడి ప్రోటీన్ పౌడర్ అని పిలుస్తారు. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రెడీమెడ్ సత్తు పౌడర్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకోవచ్చు. అయితే దీన్ని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు.


సత్తు తయారీ


కాల్చిన వేయించిన శనగలు( ఉప్పు శనగలు) తీసుకోవాలి. వాటిని పొడి చేసుకుని పెట్టుకోవాలి. అందులో వేయించిన బాదం, మిల్లెట్స్, బార్లీ కూడా పొడి చేసుకుని కలుపుకోవచ్చు. ఇవి వేయించుకునే ముందు చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ తక్కువ మంట మీద 10-15 నిమిషాల వరకు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. తేమ లేని కంటైనర్ తీసుకుని అందులో ఈ పొడి నిల్వ చేసుకోవచ్చు. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చిన వంటకాలు చేసుకుని తీసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది.


సత్తు షర్బత్


ఒక గ్లాసు మజ్జిగలో 2 టేబుల్ స్పూన్ల సత్తుని వేసుకోవాలి. తగినంత ఉప్పు, ఎండు మిర్చి జోడించుకోవాలి. సత్తు షర్బత్ పల్చగా చేసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మరసం వేసుకోవచ్చు. వీటన్నింటినీ కలుపుకుని తాగితే చాలా రుచిగా ఉంటుంది.


సత్తు పరోటా


సత్తు పరోటా కష్టమైన పని ఏమి కాదు. ఆలూ పరోటా ఎలా తయారు చేస్తారో ఇది కూడా అలాగే చేసుకోవాలి. పరోటా ఫిల్లింగ్ సిద్ధం చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ల సత్తుని తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాల నూనె వేసి, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ మిశ్రమానికి ఉప్పు, నల్ల మిరియాల పొడి, జీలకర్ర వేసుకోవాలి. పిండిని గుండ్రంగా తయారు చేసి అందులో సత్తు పెట్టుకోవాలి. పరోటా ఉండలు చుట్టుకున్నట్టే వీటిని కూడా చేసుకుని రుద్దుకోవాలి. నూనెతో రెండు వైపులా ఉడికించుకోవాలి.


సత్తు గంజి


దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాలు, పంచదార/ బెల్లం కలుపుని తీపి గంజిగా సత్తుని చేసుకుంటారు. ఒక గిన్నెలో వేడి పాలు తీసుకుంటే మంచిది. అందులో సత్తు పొడి కలుపుకోవాలి. రుచికి సరిపడా చక్కెర వేసుకోవాలి. మీకు కావాలంటే గింజలు, విత్తనాలు జోడించుకోవచ్చు.


సత్తు ప్రయోజనాలు


దేశంలో స్థానికంగా లభించే అత్యంత ఆరోగ్యకరమైన ధాన్యాల మిశ్రమం సత్తు పొడి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచేందుకు సత్తు సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి ఇది మంచి ఆహారం. ఇది తింటే పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అతిగా తినదాన్ని నివారిస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పోషకాల పవర్ హౌస్ గా సత్తు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: టీతో పాటు ఈ స్నాక్స్ తింటే విషపూరితం కావచ్చు