సాయంత్రం వేళ వేడి వేడి టీ తాగడం చాలా మందికి అలవాటు. వాటితో పాటు బిస్కెట్స్, పకోడీ, సమోసా తింటూ ఉంటే సూపర్ గా ఉంటుంది. అయితే టీతో పాటు కొన్ని వంటకాలు కలిపి తీసుకుంటే శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఒక్కోసారి అవి విషపూరితం కూడా కావచ్చని మీకు తెలుసా?  వాటిని కనుక మీరు తిన్నారంటే టీ తాగిన అనుభూతి చెడిపోవడమే కాదు ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది. మీరు టీతో పాటు తినకూడదని కొన్ని ఆహార పదార్థాల జాబితా ఇది..


స్పైసీ ఫుడ్


ఈవినింగ్ అయితే ఏదైనా స్పైసీ ఫుడ్ తినాలని ఆశగా ఉంటుంది. అవి తింటూ టీ తాగితే ఇక అంతే సంగతులు. కారంగా, ఘాటైన ఆహారాలు తింటూ టీ తాగకూడదు. టీ టెస్ట్ ని ఇవి చంపేస్తాయి. టీ రుచి గుర్తించడం కూడా కష్టమవుతుంది.వెల్లుల్లి, ఉల్లిపాయ, వేడి వేడి సాస్, కూర, మిరపకాయ వంటి వాటితో కలిపి టీ తీసుకోకూడదు.


ఆమ్ల ఆహారాలు


సిట్రస్ పండ్లు వంటి ఆమ్లత్వం అధికంగా ఉండే ఆహారాలు టీలో ఉండే కాటేచిన్స( యాంటీ ఆక్సిడెంట్లు) శోషణకు ఆటంకం కలిగిస్తాయి. టీ తీసుకునే సమయంలో సిట్రస్ పండ్లు తింటే అది మీ శరీరం గ్రహించే కాటేచిన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది.


పాల ఉత్పత్తులు


అదేంటి పాలు లేకుండా టీ ఎలా తాగుతారని అనుకుంటున్నారా? కానీ పాలు లేదా క్రీమ్ టీలోని పాలీఫెనాల్స్ ని అడ్డుకుంటుంది. వాటి యాంటీ యాక్సిడెంట్ ప్రయోజనాలను తగ్గిస్తుంది. ఈ ప్రభావం బ్లాక్ టీలో తక్కువగా ఉంటుంది. చాలా మంది టీలో పాలు లేదా క్రీమ్ వేసుకుని ఆ రుచిని ఆస్వాదిస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచి చేయదు.


తీపి ఆహారాలు


కేకులు,, బిస్కెట్లు, చాక్లెట్ వంటి తీపి ఆహారాలు తీసుకుంటూ చాలా మంది టీ తాగుతారు. కానీ ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. ఇది శక్తి తగ్గిపోయేలా చేస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. తీపి పదార్థాలు మితంగా తీసుకోవాలి. అలాగే వాటిని కాంప్లిమెంటరీ ఫ్లేవర్ ఉన్న టీతో కలిపి తీసుకోవడం ఉత్తమం.


జిడ్డుగల ఆహారాలు


వేయించిన లేదా జిడ్డు కలిగిన ఆహారాలు తీసుకుంటే బరువుగా అనిపిస్తాయి. ఇవి జీర్ణం కావడం కష్టం. పల్లీ పట్టి వంటివి జిడ్డు కలిగిన ఆహారాలు టీతో పాటు తీసుకోకూడదు. దాని వల్ల పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంది. టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ భారీ ఆహారాలతో జత చేయడం వల్ల ఈ ప్రయోజనం పొందలేకపోవచ్చు.


సాధారణంగా తేలికైన, రుచికరమైన స్నాక్స్ తో టీని ఎంచుకోవడం ఉత్తమం. ఫైబర్ లేదా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కెఫీన్ శోషణను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయి. మీకు నచ్చిన, శరీరానికి ఏది మంచి ఆహారమో అది తీసుకుంటే ఉత్తమంగా పని చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఆ సమస్యతో బాధపడే మహిళలకు సూపర్ ఫుడ్స్ ఇవి