యుక్తవయసు తర్వాత ఏ సమయంలోనైనా కనిపించే హార్మోన్ వ్యాధి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్). దీని వల్ల గర్భం దాల్చడం కష్టం అవుతుంది. అండాశయ తిత్తులు, జుట్టు పెరగడం, మొటిమలు, దీర్ఘకాలిక మంట, వ్యంధత్వం వంటి అనేక ఆరోగ్య సమస్యలు అనారోగ్యం కారణంగా సంభవిస్తాయి. పీసీఓఎస్ ఉన్న స్త్రీలు టైప్ 2 డయాబెటిస్ బారిన పడతారు. ఎందుకంటే దీని వల్ల శరీరంలో తరచుగా ఇన్సులిన్ స్థాయిలను దెబ్బతీస్తుంది. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.
ఉత్తమ ఆహారాలు
ముదురు రంగు ఆకుకూరలు: బచ్చలి కూర, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ముదురు ఆకుకూరలు తీసుకోవాలి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటండీ. ఇవి రక్తంలో చక్కెర నిర్వహించడానికి సహాయపడతాయి. జీర్ణక్రియ, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు ఇవి కడుపులో మంటను తగ్గిస్తాయి. పీసీఓఎస్ సమస్యలో ఇదొక సాధారణ లక్షణం.
బెర్రీలు: బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఈ పండ్లు పీసీఓఎస్ బాధితులకు ఉత్తమ పండ్లు.
ధాన్యాలు: క్వినోవా, బార్లీ, 100 % హోల్ వీట్ బ్రెడ్, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు తీసుకోవాలి. శరీరానికి కావాల్సిన ఫైబర్, పోషకాలను ఇది అందిస్తుంది.
అవకాడో: అవకాడోల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు ఉన్నాయి. ఇవి బరువు తగ్గడాన్ని ప్రోత్సాహిస్తాయి. ఇవి తినడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి శరీర వాపును తగ్గిస్తాయి.
గింజలు, విత్తనాలు: వాల్ నట్స్, జీడిపప్పు, బాదం, పెకాన్, అవిసె గింజలు, చియా విత్తనాలలో అసంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. పీసీఓఎస్ ఉన్నట్లయితే ఈ మంచి కొవ్వులు ఉంటాయి. ఇన్సులిన్ నిరోధక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి.
చిలగడదుంపలు: పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళు తెల్ల బంగాళాదుంపలు కంటే చిలగడదుంపలు ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ మందగించేలా చేస్తుంది.
టొమాటో: టొమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉండటం వల్ల పీసీఓఎస్ మరొక మంచి ఆహారం. ఇందులో విటమిన్ సితో పాటు లైకోపీన్ శరీర కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్తో పోరాడేందుకు సహాయపడతాయి. ఇవి వాపును తగ్గిస్తుంది.
గ్రీన్ టీ: గ్రీన్ టీ లో పాలీఫెనాల్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వాపుతో పోరాడతాయి. ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి.
బ్రకోలి: బ్రకోలి, కాలీప్లవర్ వంటి నాన్ స్టార్చ్ కూరగాయలు ఈ సమస్య ఉన్న మహిళలకు చక్కగా ఉపయోగపడతాయి. వాపుని తగ్గించే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి.
కొవ్వు చేపలు: ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే చేపలు తింటే మంచిది. కొవ్వు ఎక్కువగా ఉండే సాల్మన్, ట్యూనా, మాకేరెల్, సార్డినెస్ చేపలు తినాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఆందోళన, యాంగ్జైటీని తగ్గిస్తుంది. ఈ రెండు పరిస్థితులను పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా ఎదుర్కొంటారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.