ర్గర్ అంటే బన్‌తోనే తయారు చేస్తారని అనుకుంటున్నారా? ఇడ్లీతో కూడా చేయొచ్చు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, మీరు ఈ వీడియో చూడాల్సిందే. సాధారణంగా బర్గర్ అంటే.. బన్‌ను నిలువగా కోసి దాని మధ్యలో కూరగాయలు, సాస్, ఆలుటిక్కా లేదా చికెన్ టిక్కాలు, చీజ్ పెడతారు. తినేప్పుడు అది చాలా స్పైసీగా, క్రంచీగా ఉంటుంది. మీకు కూడా ఆ రుచి తెలిసే ఉంటుంది. కానీ, ఇడ్లీతో బర్గర్ అంటే ఎలా ఉంటుందనేగా మీ సందేహం? అయితే, అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. 


స్ట్రీట్ ఫుడ్ భాగ్యనగర్ (Street food Bhagyanagar) ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇందుకు మీకు కావల్సింది జస్ట్ రెండు ఇడ్లీలు, ఆలు టిక్కా, చట్నీ, వెజ్ మయోనేజ్ ఉంటే చాలు. ముందుగా ఒక పెద్ద సైజు ఇడ్లీ తీసుకుని దానికి స్పైసీ చట్నీ రాయాలి. ఆ తర్వాత వెజ్ మయోనేజ్ పెట్టాలి. దానిపై ఆలు టిక్కా పెట్టి, మళ్లీ వెజ్ మయోనేజ్, చట్నీ, కాస్త టమోటా సాస్ రాసి.. దానిపై మరో ఇడ్లీ పెడితే చాలు.. ఇడ్లీ బర్గర్ రెడీ. 






Also read: ఇచ్చిన బొమ్మలో మీ మెదడు మొదట ఏం గమనించింది? దాన్ని బట్టి మీ మనసు ఎలాంటిదో చెప్పవచ్చు