Breast cancer: క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో తెలిసిందే. మహిళలు ఎక్కువగా ఈ వ్యాధికి గురవ్వుతూ ఉంటారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రొమ్ము క్యాన్సర్ ముందుగానే గుర్తించడం ద్వారా మొదటి దశలోనే దాన్ని కంట్రోల్ చేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు కొన్ని రకాల పరీక్షలు చేయించుకుంటే సరిపోతుందని ఆంకాలజిస్టులు సలహా ఇస్తున్నారు. సెల్ఫ్ టెస్టింగ్ తో పాటు, క్లినికల్ బ్రెస్ట్ టెస్టింగ్, బయాప్సీ, జన్యు పరీక్షలు, ఎమ్మారై అల్ట్రాసౌండ్ వంటి పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు. 


రొమ్ములో ముద్దలు ఏర్పడటం:


సాధారణంగా మహిళలు తమ రొమ్ములను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. రొమ్ములోపల ఏవైనా ముద్ద రూపంలో గడ్డల రూపంలో కానీ కణజాలం మీ చేతికి తగిలినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం సరైన పని. 


రొమ్ము ఆకృతిలో మార్పు:


సాధారణంగా మహిళలు తమ రొమ్ములను పరీక్షించుకున్నప్పుడు వాటి ఆకృతిలో రెండు ఒకే రకంగా ఉండాలి. ఏదైనా ఒక రొమ్ము అసాధారణంగా ఆకృతిలో మార్పు చెందినట్లయితే వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది. 


రొమ్ముపై చర్మం రంగు మార్పు:


రొమ్ములపై ఉన్న చర్మం పొలుసులుగా మారడం, ఎర్రబడటం, సున్నితంగా మారడం, ముట్టుకుంటే నొప్పి లేవడం వంటి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. 


చనుమొనల్లో మార్పులు:


రొమ్ములపై ఉండే చనుమొనలు లోపలి వైపుకు వెళ్లిపోవడం. లేదా ముట్టుకుంటే నొప్పి కలగడం. అసాధారణంగా ద్రవాలు స్రవించడం వంటి లక్షణాలు కనిపించినట్లయితే, ఆంకాలజిస్ట్ వద్దకు వెళ్లడం సరైన మార్గంగా చెప్పవచ్చు. వీటితోపాటు బరువు తగ్గడం, అలసట ఏర్పడటం వంటి అసాధారణ లక్షణాలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లో కనిపిస్తాయి. 


బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించే పరీక్షలు ఇవే:


బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించడానికి మొదటి పరీక్ష సెల్ఫ్ టెస్టింగ్ అని చెప్పాలి. మహిళలు అద్దం ముందు నిలబడి రొమ్ములను తమ చేతులతో గట్టిగా లోపలికి అదమాల్సి ఉంటుంది. ఈ సమయంలో వారికి ఏదైనా ముద్ద వంటి పదార్థము, గడ్డల వంటి పదార్థము తగిలినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే మంచిది. 


క్లినికల్ టెస్టులు:


బ్రెస్ట్ క్యాన్సర్ మీకు సోకినట్లు అనుమానం కలిగినట్లయితే ఆంకాలజిస్టును కలవడం ముఖ్యమైన పనిగా చెప్పవచ్చు వీరు రెగ్యులర్ క్లినికల్ పరీక్షలు చేసేందుకు సిఫార్సు చేస్తారు. ఇందులో ప్రధానంగా మీ వంశంలో ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఉన్నట్లయితే ఈ పరీక్షలను నిర్వహిస్తారు. 


ఇమేజింగ్ పరీక్షలు:


రొమ్ములోపల కణతులు గాని, గడ్డలు కానీ ఏ అసాధారణ కణజాలం కానీ గుర్తించడానికి అల్ట్రాసౌండ్, MRI పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో రొమ్ములోపలి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. 


బయాప్సీ:


రొమ్ము లోపల ఏదైనా అసాధారణమైనటువంటి కణజాలం కనిపించినట్లయితే ఆ కణజాలంలోని కొద్ది మొత్తాన్ని సేకరించి దాన్ని పరీక్షకు పంపిస్తారు. ఆ పరీక్షలో కణజాలం క్యాన్సర్ కణం అని తేలినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ గా నిర్ధారిస్తారు. అప్పుడు చికిత్స ప్రారంభిస్తారు. 


బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి. కానీ ప్రస్తుతం ఆధునిక విజ్ఞానం చాలా అభివృద్ధి చెందింది. క్యాన్సర్ పైన పరిశోధనలు కూడా చాలా విస్తృతం అయ్యాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డ మహిళలను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా చొరవ ప్రారంభమైంది. అలాగే వైద్య విధానం కూడా పలు మార్పులకు గురైంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి వైద్య విధానం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డ మహిళలు తిరిగి ఆరోగ్యంగా మారుతున్నారు. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తమ జీవితం గడుపుతున్నారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ను సకాలంలో గుర్తించడం ద్వారా మహిళలు తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.


Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.