High Blood Pressure: ప్రపంచంలో ఎక్కువ శాతం మందిని వేధిస్తున్న సమస్య అధిక రక్తపోటు. యాభై ఏళ్లు దాటితే చాలు హైబీపీ ఉంటేమో కచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది వచ్చాక తగ్గడం అంటూ ఉండదు. అధికరక్తపోటు వల్ల ఇతర రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉప్పు లేని ఆహారాలు తినడం అత్యవసరం. అధిక రక్తపోటునే హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. రక్తనాళాల్లో రక్తం అత్యంత వేగంగా ప్రవహిస్తూ రక్తనాళాల గోడలను గుద్దుకుంటూ వెళుతుంది. ఆ రాపిడి చాలా ప్రమాదం. దాన్నే హైబీపీ అంటారు. దీని వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దీన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
నీరు తాగితే ఎంత ఫలితమో
ఆరోగ్యనిపుణులు చెప్పిన ప్రకారం నీరు సరిపడినంత తాగితే ఎంతో ఆరోగ్యం. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉన్నప్పుడు శరీరమంతా రక్తాన్ని పంపింగ్ చేయడంలో గుండె మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. దాహం వేసిన వేయకపోయినా గంటగంటకూ నీళ్లు తాగుతూనే ఉండాలి.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం అధిక రక్తపోటును నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తినడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్ తాగకపోవడం, శారీరక శ్రమ, ఒత్తిడి లేకుండా జీవించడం, బరువు పెరగకపోవడం, ధూమపానం మానేయడం వంటివి పాటించాలి. వీటితో పాటూ పుష్కలంగా నీళ్లు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్ని నీళ్లు తాగాలి?
రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తగ్గకుండా తాగాలి. దాహం వేసినప్పుడే నీళ్లు తాగాలనే నియమాలు పెట్టుకోకూడదు. ఒక రోజులో కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు శరీరంలోకి చేరాల్సిందే. నీరు అధికరక్తపోటును పెంచే ప్రమాదాన్ని తగ్గించడంతో పాటూ అదనపు సోడియాన్ని తొలగించే పక్రియలో కూడా నీరు సహాయపడుతుంది.
క్రాన్ బెర్రీ జ్యూసుతో...
అధికరక్తపోటు ఉన్న వారికి క్రాన్బెర్రీ జ్యూసు చాలా మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మంటను, వాపును ఎదుర్కోవడానికి యాంటీ ఆక్సిడెంట్లు సాయం చేస్తాయి. రక్తనాళాలను సడలిస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు
Also read: చిక్కని పాయ సూప్ రెసిపీ, చల్లని వేళ రోగనిరోధక శక్తిని పెంచే వెచ్చని రుచి
Also read: ఆ రాష్ట్రాల్లో ప్రజల చర్మం మంటలకు కారణం ఈ కీటకమే, కుట్టకుండానే మండిపోయేలా చేస్తుంది