బీహార్, సిక్కిం, పశ్చిమబెంగాల్లో గ్రామాల్లోని ప్రజలకు చర్మంపై దద్దుర్లు, మంట వస్తున్నాయి. అవి కొన్ని సార్లు తీవ్రమైన చర్మ వ్యాధులుగా కూడా మారిపోతున్నాయి.ఈ చర్మ సమస్యలకు కారణం ‘నైరోబీ ఫ్లై’ అనే కీటకం. ఇది మనదేశానికి చెందినది కాదు ఆఫ్రికా దేశాల నుంచి ఇతర దేశాలకు చేరింది. అలా మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లోకి ఇది ప్రవేశించింది. అసలే కరోనాతో అల్లకల్లోలంగా మారిన దేశం ఇప్పుడే కోలుకుంటుంటే ఏదో ఇక వైరస్ దాడి చేస్తూనే ఉంది. సిక్కింలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో వంద మంది విద్యార్థులకు ‘నైరోబి ఫ్లై’ సోకింది. వారందరికీ చర్మంపై విపరీతమైన దురదలు వచ్చాయి. అందుకే ఆయా రాష్ట్రాల్లో ఒళ్లంతా బట్టలు కప్పుకుని ఉండమని సూచించారు వైద్యులు. ఇన్ఫెక్షన్ సోకాక వైద్య సహాయం కూడా అవసరం అవుతుంది. 


ఇవి కుట్టవు కానీ...
నైరోబీ ఫ్లై కీటకాలను డ్రాగన్ బగ్స్ అని కూడా అంటారు. రోవ్ బీటిల్స్ అని కూడా పిలుస్తారు. నారింజ, నలుపు రంగులో ఉంటాయివి. కాంతి అధికంగా ఉంటే ఈ కీటకాలు బాగా తిరుగుతాయి. కానీ ఈ కీటకాలు ఎవరినీ కుట్టవు.మనిషిపై వాలినప్పుడు విషపూరితమైన పదార్థాన్ని చర్మంపై చల్లుతుంది. దాని వల్లే చర్మంపై దద్దుర్లు, బొబ్బలు వస్తాయి.ఇలా దద్దుర్లు రావడానికి కారణం పెడెరిన్ అనే రసాయనం. ఈ రసాయనం కీటకాల లోపల ఉండే బ్యాక్టిరియా ఉత్పత్తి చేస్తుంది. అవసరం అయినప్పుడు చర్మంపై చిమ్ముతాయి. ఇలా చిమ్మిన 24 గంటల తరువాత అసాధారణ మంట మొదలవుతుంది. 


కీటకం కుట్టిన వెంటనే ఆ ప్రాంతాన్ని నీరు, సబ్బుతో కడగాలి. దోమతెరల్లోనే నిద్రపోవాలి. ఎరుపు, నలుపు రంగులో ఉండే కీటకాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. 


కంటికీ సమస్యే...
ఈ కీటకాల వల్ల కళ్లకూ సమస్యలు తప్పవు. కీటకాలలో ఉండే విష రసాయనం కళ్లకు చేిరతే చాలా ఇబ్బంది అవుతుంది. కంటి చూపును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు


Also read: రాత్రి ఎనిమిది తరువాత తినకూడని ఆహారాలు ఇవే, తింటే ఈ సమస్యలు తప్పవు



Also read: వానాకాలంలో అరటి పండ్లు తినొచ్చా? పిల్లలకు పెట్టొచ్చా?


Also read: ఒమిక్రాన్ BA.5 మిగతా వేరియంట్లతో పోలిస్తే చాలా పవర్ ఫుల్, వ్యాక్సిన్ వేసుకున్నా వదలడం లేదు