సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క ఒకటి. నాన్ వెజ్ కూరల్లో కచ్చితంగా దాల్చిన చెక్క వాడుకుంటాం. అందుకే చాలా మంది ఇళ్ళల్లో దాల్చిన చెక్క పొడిగా చేసి స్టోర్ చేసుకుంటారు. రుచి, మంచి వాసనతో పాటు మంచి ఔషధ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. దాల్చినచెక్క యాంటీ డయాబెటిక్ ఏజెంట్, యాంటీఆక్సిడెంట్ ఏజెంట్, యాంటీమైక్రోబయల్ ఏజెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక టీ స్పూన్ దాచిన చెక్క పొడిలో కేలారీలు 6.42 కేసి, కార్బో హైడ్రేట్ 2.1 గ్రా, కాలిష్యం 26.1 మి. గ్రా, మెగ్నీషిఊయమ్ 1.56 మి. గ్రా, భాస్వరం 11.2 మి. గ్రా, పొటాషియం 11.2 మి. గ్రా, ఉంటాయి. ఇవే కాకుండా ఇందులో బి కాంప్లెక్స్, కొలిన్, బీటా కెరొటిన్,లైకోపిన, లూటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది టైపు 2 డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో రెండు రకాలు ఉన్నాయి. ఈ 1. సిలోన్ దాల్చిన చెక్క, 2. కాసియా దాల్చిన చెక్క లేదా చైనా దాల్చిన చెక్క. ఇవి రెండింటిలో సిలోన్ దాల్చిన చెక్క చాలా మంచిది. శ్రీలంక కి చెందినది ఇది. కాసియా చెక్క చైనా నుంచి వచ్చింది ఇది అంతా ప్రభావవంతంగా పని చెయ్యదు. 


డయాబెటిక్ రోగుల కోసం


మధుమేహ బాధితులు దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఇన్సులిన్ మిమెటిక్, ఇన్సులిన్ సెన్సిటైజింగ్ షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. 40 రోజుల పాటు రోజుకు 6 గ్రాముల దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించినట్టు ఓ సర్వేలో తేలింది. ఆయుర్వేద వైద్యం ప్రకారం దాల్చిన చెక్క మధుమేహ రోగులకే కాకుండా కడుపు ఉబ్బరం, విరోచనాలు తగ్గించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. దాల్చిన చెక్క బెరడు పంటి నొప్పి, కెల్లా నొప్పులకి, రక్త స్రావం జరగకుండా చేసేందుకు ఉపయోగపడుతుంది. 


సైడ్ ఎఫ్ఫెక్ట్స్ 


దాల్చిన చెక్క అతిగా వాడటం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బ తినే అవకాశం ఉంది. అధిక మోతాదులో దీన్ని తీసుకోవడం వల్ల అది విషపూరితంగా కూడా మారే ప్రమాదం ఉంది. డయాబెటిక్ మందులు వాడే వాళ్ళు వైద్యులని సంప్రదించకుండా దీన్ని తీసుకోకూడదు. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మీరు యవ్వనంగా కనిపించాలని అనుకుంటున్నారా? ఈ పండ్లు తప్పకుండా తీసుకోవాల్సిందే


Also Read: బరువు తగ్గేందుకు ఉల్లి మార్గం- అవునండీ మీరు విన్నది నిజమేనండోయ్