Honey Side Effect: చిన్న పిల్లలకు జలుబు చేసినప్పుడు తల్లిదండ్రులు తేనె పట్టిస్తారు. అది ఇవ్వడం వల్ల జలుబు నుంచి వాళ్ళకి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. తేనె సహజ స్వీటేనర్ మాత్రమే కాదు ఉత్తమమైన ఆహారాలలో ఒకటి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పని చేస్తుంది. కాలిన గాయాలకు, దగ్గుకి చికిత్స చేసేందుకు తేనె ఉపయోగిస్తారు. దీన్ని తినడానికి పిల్లలు కూడా ఎంతో ఇష్టం చూపిస్తారు. ఆయుర్వేదం ప్రకారం తేనె పిల్లల్లో పొడి దగ్గును తగ్గిస్తుంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏడాది కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వడం ప్రమాదకరం. కొన్ని అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 12 నెలల కంటే తక్కువ వయసు పిల్లలకు తేనె పట్టిస్తే ప్రాణాంతకం కావచ్చు.


ఎంత ప్రమాదమంటే..


పిల్లలకు తేనె ఇవ్వడం వల్ల వచ్చే ప్రమాదాన్ని బోటులిజం అని అంటారు. ఆరు నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి తేనె పట్టిస్తే మరింత ప్రమాదం. ఎన్ హెచ్ ఎస్ ప్రకారం క్లోస్టిడియం బోటులినమ్ తేనె ఉత్పత్తుల్లో ఉంటుంది. ఇది ఎక్కువగా మట్టిలో కనిపించే బ్యాక్టీరియా. ఇవి పేగులపై దాడి చేసి శరీరంలో హానికరమైన న్యూరోటాక్సిన్ లను ఉత్పత్తి చేస్తాయి. ఆ విష పదార్థాలు శిశువు పేగుల్లోకి చేరి వారి నరాలు, మెదడు, వెన్నుపాముపై దాడి చేసి పక్షవాతం, మరణానికి కూడా కారణంఅవుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది శిశువులు ఈ పరిస్థితి నుంచి కోలుకున్నప్పటికీ పక్షవాతం బారిన పడిన చిన్నారులు మాత్రం కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఎన్ హెచ్ ఎస్ చెబుతోంది. బోటులిజం అనేది అరుదైన, తీవ్రమైన వ్యాధి. ఇది 5-10 శాతం మంది పిల్లలని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఏడాది వయసు వచ్చే వరకు శిశువులకు జీర్ణవ్యవస్థ అభివృద్ధి చెందదు. వారి శరీరం బోటులిజంకి కారణమైన టాక్సిన్స్ తో పోరాడలేవు.


Also Read: కలబందతో బట్టతల సమస్యకు చెక్ పెట్టొచ్చా!


బోటులిజం లక్షణాలు


☀బలహీనత


☀ఆహారం తీసుకోలేకపోవడం


☀మలబద్ధకం


☀అలసట


☀చికాకు


☀ఊపిరి ఆడకపోవడం


☀ఏడుస్తూ ఉంటారు


☀మూర్చలు


తేనె తిన్న 12-36 గంటల తర్వాత బోటులిజం లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. బ్యాక్టీరియా వేడిని కూడా ఇది తట్టుకుని ఉంటుంది. అందుకే కనీసం వండిన తేనె కూడా శిశువుకి ఇవ్వకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Also Read: తలనొప్పితో నిద్రలేస్తున్నారా? అందుకు కారణాలు ఇవేనేమో చెక్ చేసుకోండి


ఎప్పుడు తినిపించాలి?


బిడ్డకి ఏడాది వచ్చే వరకు తేనె పట్టించకూడదు. తర్వాత మెల్లగా అలవాటు చేయవచ్చు. శిశువుకి ఇచ్చే ఆహారంలో తేనె జోడించి పెట్టవచ్చు. వారికి పెట్టె ఓట్మీల్ ఆహారంలో వేయవచ్చు.


☀టోస్ట్ మీద వేసుకోవచ్చు


☀పెరుగుతో కలిపి తినిపించొచ్చు


☀పాలలో ఒక టీ స్పూన్ కలిపి తాగించవచ్చు


☀పాన్ కేక్ లో పంచదారకి బదులుగా తేనె ఉపయోగించవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.