Fudge Recipe with Three Ingredients : హోలీ సమయంలో రంగులతో ఆడుకుంటూ ఉంటారు. అలాగే బంధుమిత్రులను కలిసి స్వీట్స్ పంచుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల దృష్ట్యా ఇంటికి వెళ్లే సమయం దొరకదు. కానీ ఇంట్లో వారిని.. వారు చేసే స్వీట్లను కచ్చితంగా మిస్ అవుతారు. అలాంటి వారు ఇంట్లోకి వారికి ఫోన్ చేసి విష్ చెప్పేయండి. సులువుగా మూడు పదార్థాలతో స్వీట్ చేసుకుని ఆస్వాదించేయండి. ఇంతకీ ఏమిటి ఆస్వీట్.. దానిని ఎలా తయారు చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ఫడ్జ్. ఇది ఒక హెల్తీ డిజెర్ట్. మీకు స్వీట్ క్రేవింగ్స్ ఉండి.. హెల్తీగా ఏమైనా తినాలనుకుంటే కచ్చితంగా ఈ ఫడ్జ్​ని మీ డైట్​లో కలిపి తీసుకోవచ్చు. పైగా బరువు తగ్గడంలో కూడా ఈ ఫడ్జ్ మీకు మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. దీనిని చేయడం పెద్ద కష్టమేమి కాదు. కేవలం మూడే మూడు పదార్థాలతో.. టేస్టీగా.. హెల్తీ స్వీట్​ని మనం తయారు చేసుకోవచ్చు. ఇంతకీ దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఈ స్వీట్​ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


బాదం - 1 కప్పు


ఖర్జూరం - 1 కప్పు


డార్క్ చాక్లెట్ - 1


కోకోపౌడర్ - 1 స్పూన్ (ఆప్షనల్)


తయారీ విధానం


ముందుగా ఓ 5 బాదంలు తీసి పక్కనపెట్టుకోండి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి బాదంను డ్రై రోస్ట్ చేయండి. అవి బాగా వేగిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. వాటిని చల్లారనివ్వండి. వేయించిన బాదంలు పూర్తిగా చల్లారిన తర్వాత దానిని మిక్సీ జార్​ లేదా బ్లెండర్​లో తీసుకుని మిక్సీ చేయండి. ఇప్పుడు ఖర్జూరంలోని సీడ్స్​ తీసేసి.. ఆ ముక్కలను కూడా బ్లెండర్​లో వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఓ మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోండి. ఇప్పుడు డార్క్ చాక్లెట్​ను మెల్ట్ చేయండి.


ఓ గిన్నెలో వేడి నీరు తీసుకుని.. మరో చిన్ని గిన్నెలో డార్క్ చాక్లెట్​ వేసి.. వేడి నీళ్లలో మునగకుండా ప్లేస్ చేయండి. చాక్లెట్ మెల్లగా కరుగుతుంది. ఇలా కరిగిన డార్క్ చాక్లెట్ మిశ్రమాన్ని.. ముందుగా తయారు చేసుకున్న బాదం మిక్స్​లో వేసి బాగా కలపాలి. దీనిలోనే ముందుగా తీసుకున్న బాదంలను కట్​ చేసి.. వేసి మరోసారి బాగా కలపాలి. దానిని ఓ గాజు గిన్నెలో ప్లేస్​ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసే ముందు ఓ కవర్​ని ప్లేస్​ చేయాలి. ఎందుకంటే లోపలున్న మిశ్రమం గిన్నెకి అంటుకోకుండా తేలికగా బయటకు తీయవచ్చు. 


గిన్నెలో వేసి మిశ్రమాన్ని చక్కగా గరెటతో నొక్కాలి. దానిని పైన కవర్​ చేయాలి. మీరు బాదం ముక్కల ప్లేస్​లో హాజెల్​నట్స్​ కూడా వేసుకోవచ్చు. లేదంటే రెండూ కలిపి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం సెట్​ అయ్యేవరకు రిఫ్రిజరేటర్​లో ఉంచాలి. ఓ రెండు గంటలు దానిని అలానే ఉంచేస్తే.. ఫడ్జ్ బాగా తయారవుతుంది. దీనిని మీరు బయటకు తీసి.. మీకు స్క్వేర్​ రూపంలో కట్ చేసుకోవచ్చు. దీనిపై మీరు కోకోపౌడర్​ కూడా చల్లుకోవచ్చు. అంతే టేస్టీ, హెల్తీ ఫడ్జ్ రెడీ అయిపోయినట్లే. 


హోలీ సమయంలో బ్యాచిలర్స్​ కూడా చాలా సింపుల్​గా ఈ స్వీట్​ని రెడీ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో కలిసి ఉండేవారు కూడా ఈ స్వీట్​ను తయారు చేసి ఇంటిల్లిపాదికి తినపించవచ్చు. ఇది టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ స్వీట్​తో తమ స్వీట్ క్రేవింగ్స్ తీర్చుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి.. స్ట్రిక్ట్​గా డైట్​ చేసే వారికి ఈ స్వీట్ మంచి ఫెస్టివ్ వైబ్​ని ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ స్వీట్ తయారు చేసుకుని.. మీరు తినండి. నచ్చినవారికి తినిపించండి. 


Also Read : గోధుమ పిండితో మైసూర్ బజ్జీలు.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది