OTT Movies Releasing This Week: ఈవారం ఎన్నో చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అన్నింటికంటే శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న 'ఓం భీమ్ బుష్'పై ఎక్కువగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇది కాకుండా మార్చి 22న థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు. దీంతో ఎంటర్‌టైన్మెంట్ లవర్స్ అంతా ఓటీటీలో ఆప్షన్స్ వెతకడం మొదలుపెట్టారు. ఇక మార్చి 21, 22న ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్..
ఈవారం అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పటికే కొత్త సినిమాల సందడి మొదలయ్యింది. ఏకంగా మూడు భాషల్లోని మూడు సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభించుకున్నాయి.
- మరక్కుమ నెంజమ్ (తమిళ సినిమా) - మార్చి 19
- ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా) - మార్చి 21
- రోడ్ హౌజ్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 21
ఇప్పటికే సారా అలీ ఖాన్ లీడ్ రోల్ చేసిన దేశభక్తి సినిమా ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రాన్ని చాలామంది ప్రైమ్ సబ్‌స్క్రైబర్స్ చూసి సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు అందిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్..
నెట్‌ఫ్లిక్స్‌లో ఈవారం సినిమాలతో పాటు రెండు ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. అంతే కాకుండా హృతిక్ రోషన్, దీపికా పదుకొనె కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఫైటర్’ కూడా మార్చి 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుందని వార్తలు వచ్చినా దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
- యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ చిత్రం) - మార్చి 18
- షిర్లే (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 22
- ది కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 22
- త్రీ బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మార్చి 21
- బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మార్చి 22
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
అన్ని ఓటీటీలకంటే ఈవారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే ఎక్కువ రిలీజ్‌లు ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు, సిరీస్‌లు అయితే ఇప్పటికే స్ట్రీమింగ్‌ను ప్రారంభించుకున్నాయి.
- అబ్రహం ఓజ్లర్ (మలయాళం సినిమా) - మార్చి 20
- సాండ్ ల్యాండ్ - ది సిరీస్ (జపనీస్ వెబ్ సిరీస్) - మార్చి 20
- ఎక్స్-మ్యాన్ 97 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మార్చి 20
- అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22
- డేవీ అండ్ జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మార్చి 22
- లూటేరే (హిందీ వెబ్ సిరీస్) - మార్చి 22
- ఫోటోగ్రాఫర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మార్చి 24
యాపిల్ ప్లస్ టీవీ..
- పామ్ రాయల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మార్చి 20
- ఆర్గిల్లీ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 23
వీటితో పాటు ఇతర ఓటీటీ యాప్స్‌లో కూడా మరికొన్ని సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. 'ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్' అనే ఇంగ్లీష్ సినిమా.. మార్చి 19 నుంచి బుక్ మై షోలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. ఆస్కార్‌లో అవార్డుల పంట పండించిన ‘ఓపెన్‌హైమర్’.. మార్చి 21 నుంచి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది.
Also Read: అమలా పాల్ షాకింగ్ పోస్ట్ - చేతిలో బిడ్డ, కవలలంటూ హింట్? కన్‌ఫ్యూజ్ చేస్తున్న బ్యూటీ!