Amala Paul Shared Instagram Post Viral: తమిళ్‌ స్టార్‌ హీరోయిన్‌ అమలా పాల్‌ తల్లికాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె  బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో తాజాగా ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది. ఇందులో ఫంక్షన్‌ రెడీ అవుతున్న అమలా ఓ చిన్న పాపతో కనిపించి షాక్‌ ఇచ్చింది. 'టూ హ్యాపీ కిడ్స్‌' అంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఇది చూసి అంతా అమలా పాల్‌ అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిందా? అని షాక్‌ అవుతున్నారు. అయితే ఆ పాప ఆమె కూతురా? కాదా? అని స్పష్టం చేయకుండ అందరిని డైలామాలో పడేసింది.  ఇవి ఆమె బేబి షావర్‌ ఫోటోలు అని తెలుస్తోంది. ప్రస్తుతం గర్భంతోనే ఉన్న ఆమె బేబి బంప్‌ కనిపించకుండ జాగ్రత్త పడింది. చూస్తుంటే ఇది నెటిజన్లను డైలామాలో పడేస్తూ ఈ పోస్ట్‌ చేసినట్టు అభిప్రాయలు వస్తున్నాయి.


మరీ ఆ పాప ఎవరూ?


కానీ అంతా ఈ పాప ఆమె కూతురు అనుకుని అమలాపాల్‌కు శుభకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ ఫోటోలకు అమలా పాల్‌ ఇచ్చిన క్యాప్షన్‌ మాత్రం చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఈ ఫోటోలను అమలా '2 హ్యాపీ కిడ్స్‌' అంటూ రాసుకొచ్చింది. ఆ పాపతో పాటు తనని కూడా కిడ్‌లా ఉద్దేశిస్తూ చేసిందా? లేక తనకు కవలలు జన్మించబోతున్నారని హింట్‌ ఇచ్చిందా? అనే సందేహలు వస్తున్నాయి. మొత్తానికి అమలా మాత్రం ఈ విషయంలో అందరిని డైలామాలో పడేసిందని అర్థమైపోతుంది. కానీ ఈ ఫోటోల్లో అమలా ఆ బేబీతో కలిసి నవ్వులు పూయిస్తూ హ్యాపీగా కనిపించింది. కానీ ఈ ఫోటోలకు నెటిజన్లు మాత్రం బేబీ 'సో క్యూట్‌' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.






అయితే, గతేడాది నవంబర్‌లో ఆమె రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడు, వ్యాపారవేత్త అయిన జగత్‌ దేశాయ్‌తో గతేడాది ఏడడుగులు వేసిన ఆమె నెల తిరక్కుండానే తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. అది తెలిసి అంతా షాక్‌ అయ్యారు. ఇక ఆ తర్వాత బేబీ బంప్‌ ఫోటోలు షేర్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. పెళ్లయి మూడు నెలల కూడా కాలేదు.. ప్రెగ్నెంటా? అని అప్పుడంతా గుసగుసలాడుకున్నారు.కొంతకాలం డేటింగ్‌ తర్వాత కొద్దిమంది స్నేహితులు, బంధువుల సమక్షంలో అమలాపాల్‌, జగత్‌ దేశాయ్‌లు నవంబర్ 5, 2023న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి అమలా తరచూ తన భర్తతో వెకేషన్స్‌కు వెళ్లిన ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాదు గర్భం దాల్చిన అనంతరం కూడా మాతృక్షణాలను ఆనందిస్తూ ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ కబుర్లను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అలాగే భర్తతో కలిసి బేబీ బంప్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్న ఆమె  ఆ ఫొటోలను కూడా షేర్‌ చేస్తూ భర్తపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసింది. తను మాత్రమే కాదు తన భర్త కూడా ప్రెగ్నెంటే అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేసింది. 


Also Read: బుల్లితెర చరిత్రలోనే ఫస్ట్‌టైం - 'కార్తీక దీపం 2' స్పెషల్‌ ప్రివ్యూ, వంటలక్కా మజాక!