Karthika Deepam 2 Preview Event: బుల్లితెరపై సంచలన విజయం సాధించిన 'కార్తీక దీపం' పార్ట్ 2 ప్రసారంకి అంతా సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ఈ సీరియల్ టెలికాస్ట్ కాదినుం. ఇక బుల్లితెరపై మళ్లీ వంటలక్క, డాక్టర్ బాబు సందడి మొదలుకానుంది. మార్చి 25 నుంచి 'కార్తీక దీపం 2' ప్రసారం కానున్నట్టు ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇది తెలిసి బుల్లితెర ఆడియన్స్, కార్తీక దీపం ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. సీరియల్ మళ్లీ ప్రసారంకి రాబోతుండటంతో బుల్లితెర ఆడియన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి హ్యాపీనెస్‌ని డబుల్ చేస్తూ తాజాగా నిర్మాతలు ఫ్యాన్స్‌కి మరో సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సీరియల్ కి ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మేకర్స్.
ప్రివ్యూ ఈవెంట్ లో కార్తీక్, దీప సందడి
'కార్తీక దీపం 2' మరో 5 రోజుల్లో రిలీజ్ అవుతున్న సందర్భంగా నిర్మాతలు సీరియల్ ప్రమోషన్స్‌ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మార్చి 21న సీరియల్ ప్రీవ్యూ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ మేరకు దీనిపై స్టార్ మా అధికారిక ప్రకటన ఇచ్చింది. మార్చి 21న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో 'కార్తీక దీపం 2' స్పెషల్ ప్రీవ్యూ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో అభిమానులంతా భాగంగా కావాలని పిలుపు నిచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఈ సీరియల్ స్టార్ కాస్ట్ దీప, కార్తీక్ కూడా పాల్గొంటున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి లైవ్ కూడా ఉందని స్పష్టం చేశారు.
సినిమా రేంజ్ లో కార్తీక దీపం 2 ప్రమోషన్స్
సాధారణంగా ఓ సీరియల్ ప్రసారంకు ముందు మిగతా సీరియల్స్ ద్వారా ప్రమోషన్స్ చేయిస్తుంది 'స్టార్ మా'. ప్రతి సీరియల్ టెలికాస్ట్ ముందు ప్రధాన పాత్రలతో కొత్త సీరియల్ గురించి చెప్పిస్తూ ఆసక్తిని పెంచుతారు. కానీ తొలిసారి ఓ సీరియల్‌కు ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించడం విశేషం. సీరియల్ రిలీజ్‌కు ముందు ప్రీవ్యూ ఈవెంట్ జరగడం బుల్లితెర చరిత్రలో ఇదే తొలిసారి. మూవీ రేంజ్‌లో సీరియల్ ప్రమోషన్ జరగడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. అలా విడుదలకు ముందు ప్రీవ్యూతో ప్రమోషన్స్ చేసుకుంటున్న తొలి సీరియల్ కార్తీక దీపం 2 ట్రెండ్ సెట్ చేసింది. మరి కార్తీక దీపం క్రేజ్ ఆ రేంజ్‌లో ఉందని చెప్పాలి. ఈ సీజన్ వన్ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఐపీఎల్ సీజన్‌లోనూ కార్తీక దీపం సీరియల్ టాప్ టీఆర్పి రేటింగ్‌ను కంటిన్యూ చేసిందంటే ఈ సీరియల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమైపోతుంది. అంతగా ఆదరణ పొందిన ఈ సీరియల్ ఇప్పుడు పార్ట్ వస్తుండటంతో బుల్లితెర ఆడియన్స్ అంతా హ్యాపీ ఫీల్ అవుతున్నారు.