Ilayaraja Biopic Title and First Look Poster Launch: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సంగీతంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. మ్యూజిక్‌ మ్యాస్ట్రోగా బిరుదు పొందిన ఆయన జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నో రోజులుగా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇళయరాజ బయోపిక్‌ వస్తున్నట్టు సమాచారం ఉంది కానీ, ఆయన పాత్రలో ఎవరు నటిస్తారు, షూటింగ్‌ ఎప్పుడన్నది క్లారిటీ లేదు.


ఆయన పాత్రలో తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటిస్తున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సైలెంట్‌గా బయోపిక్‌ను సెట్‌పైకి తీసుకువచ్చారు. బుధవారం చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో ఈ బయోపిక్‌ మూవీని గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ధనుష్‌, ఇళయరాజాలు సందడి చేశారు. ఈ ఈవెంట్‌లో మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా అనౌన్స్‌ చేసింది మూవీ టీం.






'ఇళయరాజా: ద కింగ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌' అనే టైటిల్‌ను ఖారారు చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా టైటిల్‌ పోస్టర్‌ను కూడా లాంచ్‌ చేశారు. స్వయంగా ఇళయరాజా చేతుల మీదుగా ఈ టైటిల్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయడం విశేషం. కాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ప్యాంటు షర్టుతో ఉన్న ధనుష్.. నడిరోడ్డుపై నిలుచుని కనిపించారు. అయితే, అందులో ఆయన గెటప్‌ను రివీల్ చేయలేదు. వెనుక వైపుకు తిరిగి నిలుచున్న పోస్టర్‌ను మాత్రమే షేర్ చేశారు. ఎప్పుడు పంచకట్టుతో ఉండే ఇళయరాజా ఈ పోస్టర్‌లో ప్యాంటు షర్టుతో ఉండటం ఆసక్తిని సంతరించుకుంది.


కాగా భాషతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఆయన మ్యూజిక్ మ్యాస్ట్రోగా గుర్తింపు పొందారు. ఐదు దశాబ్దాలుగా సంగీత దర్శకుడిగా రాణిస్తున్న ఆయన ఇప్పటి వరకు వెయ్యికిపైగా సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఈ బయోపిక్‌ ఆయన మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం కాకముందు ఆయన ఏం చేశారు, సంగీత దర్శకుడిగా ఈ స్థాయిలో ఎదిగే క్రమంలో ఎలాంటి అనుభవాలు, సమస్యలు ఎదుర్కున్నారనేది ఈ బయోపిక్‌లో చూపించబోతున్నారు.  


మరి, సంగీత దర్శకుడు ఎవరు?


అయితే ఇప్పటికే ఎందరో ప్రముఖల బయోపిక్‌లు వెండితెరపై వచ్చాయి. క్రికెటర్ల నుంచి తారల జీవితాల వరకు, అంటూ రాజకీయ నాయకుల నుంచి అండర్‌ వరల్డ్ డాన్‌ల జీవిత చరిత్రలు తెరకెక్కాయి. అవన్ని పాన్ ఇండియాగా వచ్చినవే. అయితే, వాటిలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేక డిజాస్టర్‌ అయితే మరికొన్ని బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించాయి. అయితే ఇప్పుడు ఈ లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌, మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌ కూడా పాన్ ఇండియా మూవీగానే వస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే, సంగీత దర్శకుడి బయోపిక్‌కు ఎవరు సంగీతాన్ని అందిస్తారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. తాజా పోస్టర్‌లో కూడా సంగీత దర్శకుడు ఎవరనేది రాయలేదు. మరి, తన బయోపిక్‌కు తానే సంగీతం సమకూర్చుతారా? లేదా మరొకరికి ఆ ఛాన్స్ ఇస్తారా అనే కామెంట్లు వస్తున్నాయి. అయితే, ఈ మూవీకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన ఇళయరాజాను కలిశారు. తన డ్రీమ్ నెరవేరిందని కామెంట్ కూడా చేశారు.


Also Read : తాత కోసం పాట పాడిన అరియానా - కంటతడి పెట్టిన మంచు విష్ణు!