Samantha - Tamannaah: సమంత, తమన్నా.. ఇద్దరూ టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనే తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోకస్ బాలీవుడ్‌పైనే ఉంది. ఇదిలా ఉండగా.. వీరి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. సమంత.. తన కో స్టార్ నాగచైతన్యకు పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోగా.. తమన్నా మాత్రం ఇంకా పెళ్లి జోలికి వెళ్లలేదు. కానీ ప్రస్తుతం తను బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఇక చాలాకాలం తర్వాత సమంత, తమన్నా ముంబాయ్‌లోని ఒక ఈవెంట్‌లో కలిశారు. వారు కలిసినప్పుడు విజయ్ వర్మ తీసిన ఫోటోలు ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో పాటు తన బాయ్‌ఫ్రెండ్ ఫోటోగ్రాఫీ స్కిల్స్‌ను తెగ పొగిడేస్తోంది తమన్నా.


ముంబాయ్‌లో మీటింగ్..


ప్రస్తుతం సమంత, తమన్నా.. ఇద్దరూ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టడంతో తమ తమ ప్రాజెక్ట్స్ ప్రమోషన్స్ కోసం ఇద్దరూ ముంబాయ్ వెళ్లారు. అక్కడే చాలాకాలం తర్వాత వీరిద్దరూ కలిశారు. సమంత.. తన అప్‌కమింగ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వర్షన్ టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం ముంబాయ్ వెళ్లగా.. తమన్నా తను నటించిన ‘వేదా’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ కోసం ఈ మిల్కీ బ్యూటీ.. తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ముంబాయ్ చేరుకుంది. అక్కడే అనుకోకుండా ఈ ముగ్గురు కలిశారు. సమంత, తమన్నా కలిసిన ఫోటోలను విజయ్ వర్మ తీశాడు. అందులో ఒక క్యాండిడ్ ఫోటో చాలా అందంగా అనిపించడంతో వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.


హార్ట్ ఎమోజీలు..


ముందుగా సమంత.. తన సోషల్ మీడియాలో ‘‘ఓ మై లవ్ తమన్నా.. ఈ మీటింగ్ చాలాకాలంగా వాయిదా పడుతోంది’’ అంటూ తమన్నాను, విజయ్ వర్మను ట్యాగ్ చేసింది. దానికి తమన్నా.. ‘‘నిజంగానే చాలా కాలమయ్యింది. తరచుగా కలుస్తూ ఉండు’’ అంటూ సామ్‌కు రిప్లై ఇచ్చింది. అంతే కాకుండా ‘‘విజయ్ వర్మ ఎప్పుడూ బెస్ట్ క్యాండిడ్‌ను క్లిక్ చేస్తాడు’’ అంటూ హార్ట్ ఎమోజీలతో తనపై ప్రేమను చాటుకుంది తమన్నా. ఈ క్యాండిడ్ ఫోటోలో విజయ్ వర్మ కూడా కనిపిస్తున్నాడు. దీంతో విజయ్ బాయ్‌ఫ్రెండ్ డ్యూటీ కరెక్ట్‌గా చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ అంతా ఈ జంటను చూసి ముచ్చటపడుతున్నారు. ఒకప్పుడు ఈ భామలు తరచుగా కలుస్తూ ట్రిప్స్‌కు కూడా వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఎవరి ప్రాజెక్ట్స్‌తో వారు బిజీ అయిపోయారు.



అందరూ బిజీ..


మయాసైటీస్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. కష్టపడి ‘సిటాడెల్’ ఇండియన్ వర్షన్‌ను పూర్తిచేసింది. దీనికి ‘హన్నీ బన్నీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా ఈ టైటిల్ లాంచ్ ముంబాయ్‌లో జరిగింది. ఇందులో వరుణ్ ధావన్‌తో కలిసి నటించింది సామ్. ఈ సిరీస్‌లో యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని, అవి హైలెట్‌గా నిలవనున్నాయని ఇప్పటికే సమంత బయటపెట్టింది. ఇక తమన్నా విషయానికొస్తే.. జాన్ అబ్రహం, షర్వరీ లీడ్ రోల్స్ చేస్తున్న ‘వేదా’లో తను కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. విజయ్ వర్మ.. తాజాగా ‘మర్డర్ ముబారక్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.


Also Read: 'మీర్జాపూర్' ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సీజన్ 3 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అమెజాన్!