Mirzapur Season 3 Update : అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ లలో 'మీర్జాపూర్' ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ పొలిటికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా సిరీస్ నుంచి త్వరలోనే మూడో సీజన్ కూడా రాబోతుంది. అమెజాన్లో ఎన్ని సిరీస్ లు వచ్చిన 'మీర్జాపూర్' కు మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఈ సిరీస్ కు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. 2018లో 'మీర్జాపూర్' మొదటి సీజన్ అమెజాన్ లో విడుదలై రికార్డ్ స్థాయిలో న్యూస్ సాధించి సూపర్ సక్సెస్ అయింది. తొలి సీజన్ బ్లాక్ బస్టర్ అవడంతో 2020 లో రెండో సీజన్ ని రిలీజ్ చేశారు. అది కూడా మొదటి సీజన్ ను మించి రెస్పాన్స్ అందుకుంది. ఇక చాలాకాలంగా సీజన్ 3 కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ చెప్పింది.
'మీర్జాపూర్' సీజన్ 3 వచ్చేస్తోంది
మార్చి 19న ముంబైలో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్ లో 'మీర్జాపూర్' సీజన్ 3 అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇదొక్కటే కాదు అమెజాన్లో రాబోతున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఇదే వేదికపై అనౌన్స్ చేసింది. అంతేకాదు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అయిన వెబ్ సిరీస్ సీక్వెల్స్ ని కూడా ప్రకటించింది. ఇందులో భాగంగానే 'మీర్జాపూర్' సీజన్ 3 అప్డేట్ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
'మీర్జాపూర్' సింహాసనం దక్కేది ఎవరికి?
'మీర్జాపూర్' సీజన్ 3 అప్డేట్ ఇస్తూ మంటల్లో దగ్ధమవుతున్న ఓ కుర్చీని పోస్ట్ చేశారు మేకర్స్. అంతేకాకుండా.. "కిరీటం దక్కించుకునేందుకు గుడ్డు, గోలు కొత్త పోటీదారుడుతో తలపడనున్నారు. మరి వారికి అధికారం దక్కుతుందా? లేదా బయట శక్తులతో ఆ పవర్ ఫుల్ సీట్ శాశ్వతంగా నాశనం అవుతుందా?" అంటూ పేర్కొన్నారు. ఈ సీజన్లో గుడ్డు, గోలు క్యారెక్టర్స్ మరింత పవర్ ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. అలాగే రెండవ సీజన్లో కొనసాగిన పాత్రలతో పాటు ఇంకొన్ని కొత్త పాత్రలు కూడా యాడ్ అవుతాయని అంటున్నారు. కాగా సీజన్ 3 లో పంకజ్ త్రిపాటి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, రసిక దుగల్, విజయ్ వర్మ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ విషయంలో నిరాశాపరిచిన అమెజాన్
ముంబైలో జరిగిన స్పెషల్ ఈవెంట్లో 'మీర్జాపూర్' సీజన్ 3 అప్డేట్ ఇచ్చిన మేకర్స్ ఓ విషయంలో మాత్రం ఫాన్స్ ని నిరాశపరిచారు. అదే సీజన్ 3 రిలీజ్ డేట్. 'మీర్జాపూర్' సీజన్ 3 గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా స్ట్రీమింగ్ డేట్ మాత్రం వెల్లడించలేదు. కనీసం స్ట్రీమింగ్ కి ఎప్పుడు తీసుకొస్తున్నారనే విషయంపై కూడా హింట్ ఇవ్వలేదు. దీంతో ఈ విషయంలో మీర్జాపూర్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. అయితే ఇప్పటికే సీజన్ 3 షూటింగ్ పూర్తయిందని, ఈ ఇయర్ లోనే రిలీజ్ ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో నైనా అమెజాన్ ప్రైమ్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Also Read : వామ్మో, 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ అన్ని కోట్లు పెట్టిందా?