Diabetes Affects Mens Legs : మధుమేహం అనేది ఒక్కసారి వస్తే.. జీవితాంతం ఉండిపోతుంది. అందుకే అది రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. రెగ్యూలర్ డైట్, వ్యాయామాలు, పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను దూరంగా ఉంచవచ్చు అంటున్నారు. అయితే మధుమేహం వచ్చే ముందు మగవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయట. వాటిని మీలో గమనిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి కంట్రోల్​లో ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


రక్తంలో చక్కెర అధిక స్థాయిలో కలిగి ఉండడాన్నే మధుమేహం అంటారు. ఈ సమస్య వస్తే జీవక్రియ రుగ్మతలు, దాహం పెరగడం, మూత్రవిసర్జన ఎక్కువగా రావడం, ఆకస్మికంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే రెగ్యూలర్​గా కనిపించే సమస్యలే. కానీ మధుమేహం రాకముందు కూడా శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయట. ముఖ్యంగా మగవారిలో ఆ సంకేతాలు.. మధుమేహానికి సంకేతాలని చెప్తున్నారు. ముఖ్యంగా కాళ్లలో మధుమేహ లక్షణాలు బయటపడతాయి అంటున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


తిమ్మర్లు.. 


కాళ్లు, పాదాలలో తిమ్మరిగా లేదా జలదరింపు వంటి సంకేతాలు ఉంటాయట. సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుందట. మధుమేహం ద్వారా నరాలు ప్రభావతమవుతున్నాప్పుడు ఈ మార్పు మగవారిలో ఎక్కువగా ఉంటుందట. ఇది పాదాలలో నరాల నష్టాన్ని సూచిస్తుంది. కాళ్లు తిమ్మర్లు అనేవి అందరిలో కామనే అయినా.. వాటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు.. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇబ్బంది పెడితే వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. 


పాదాల్లో తీవ్రమైన మంట


డయాబెటిక్​ వచ్చే ముందు పురుషుల అరికాళ్లలో మంట వంటి సంకేతాలు వస్తాయట. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. దీనివల్ల నిద్రకు అంతరాయం కలుగుతుందని.. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. 


గాయలు త్వరగా తగ్గవట


సాధారణంగా కొన్ని గాయాలు ట్రీట్​మెంట్ చేయకపోయినా తగ్గుతూ ఉంటాయి. కానీ మధుమేహం వస్తే ఈ తరహా గాయాలు తగ్గడం కష్టంగా ఉంటుంది. పాదాలపై గాయాలు, పుండ్లు, బొబ్బలు వంటివి వస్తే.. వాటిని నయం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి తగ్గి ఇన్​ఫెక్షన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. 



చర్మం ఆకృతిలో మార్పులు, పగుళ్లు, అల్సర్లు వంటివి కూడా మధుమేహానికి సంకేతాలేనట. ఈ తరహా సంకేతాలను విస్మరిస్తే సమస్య తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. సకాలంలో చికిత్సలు తీసుకుంటే మధుమేహ ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్తున్నారు. ఇవే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవుతూ.. వ్యాయామం రెగ్యూలర్​గా చేస్తూ ఉంటే ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవచ్చని చెప్తున్నారు. 


Also Read : డయాబెటిస్‌కు కొత్త చికిత్స - సెల్ థెరపీతో మధుమేహానికి చెక్ పెట్టిన చైనా పరిశోధకులు, ఎలాగంటే?






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.