పాశ్చాత్యా దేశాల్లో పుట్టిన నెలలను బట్టి వారి వ్యక్తిత్వం, బుద్ధులు ఎలా ఉంటాయో చెప్పుకుంటారు. ఏప్రిల్ నెలలో విలియం షేక్స్ పియర్, క్వీన్ ఎలిజబెత్ 2 వంటి గొప్పవాళ్లు జన్మించారు. పాశ్చాత్య దేశాలకు చెందిన కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు, జ్యోతిష్కులు కలిసి పుట్టిన నెలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు. అలా ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్లు ఎలా ఉంటారో చెప్పారు.
1. ఈ నెలలో జన్మించినవారు తమ పక్కన ఉన్నవారిపై చాలా నమ్మకాన్ని పెట్టుకుంటారు. తమను ప్రతికూల పరిస్థితులను నుంచి కాపాడగలిగే, మార్గనిర్దేశం చేయగలిగే వాళ్లనే తమ పక్కనే ఉంచుకునేందుకు ఇష్టపడతారు.
2. వారికి దయ, సానుభూతి అధికం. కేవలం సాటి మనుషుల పట్లే కాదు, జీవుల పట్ల కూడా. వారు ఎదుటి వారు చెప్పే బాధలను ఓపికగా వింటారు. ఎదుటవారిని ఓదార్చడంలో ముందుంటారు.
3. వీరు ఏదైనా బయటికే మాట్లాడతారు. మనసులో ఏమీ దాచుకోరు. నమ్మకంగా ఉంటారు. ఏ పని చేయడానికైనా వెనుకాడరు. సమస్యలు ఎదురైతే పారిపోరు. తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఎదురునిలిచి పోరాడతారు.
4. వీరు మాటల కంటే పనులపైనే శ్రద్ధ వహిస్తారు. చాలా ఎనర్జిటిక్ గా పనిచేస్తారు.
5. వీరు చాలా చురుకుగా ఉంటారు. సృజనాత్మకతను ఇష్టపడతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరు చాలా అరుదుగా విశ్రాంతి తీసుకుంటారు.
6. భావోద్వేగాల విషయానికి వస్తే వీరు చాలా సున్నితంగా ఉంటారు. బయటికి కఠినంగా, మొండిగా ఉన్నప్పటికీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనిషి. వీరు మెదడు కన్నా హృదయం చెప్పిందే వింటారు.
7. వీరిని ఎవరైనా నమ్మవచ్చు. చాలా విశ్వాసనీయమైనవారు. స్నేహాబంధాల కోసం ఏమైనా చేస్తారు.
8. వీరు చాలా కాన్ఫిడెంట్‌గా, నమ్మకంగా, సూపర్ ఎనర్జిటిక్ గా ఉంటారు. ఏప్రిల్ నెలలో పుట్టిన వారు నాయకులయ్యే అవకాశం కూడా ఎక్కువ. టీమ్ ను ముందుకు నడిపించడంలో ముందుంటారు.
ఏప్రిల్ విశిష్టత
ఈ నెలలోనే వసంతకాలం వస్తుంది, ప్రకృతి వికసించే సమయం ఇది. కొత్త ప్రారంభాలకు ఏప్రిల్ నెలే పునాది వేస్తుంది. ఏప్రిల్ అనే పదం లాటిన్ పదం ‘ఎపెరిరే’ నుంచి వచ్చింది. దీని అర్థం ‘తెరవడం’ అని అర్థం. కొత్త కాలం, కొత్త సమయం తెరుచుకునే కాలం అనే అర్థంతో ఏప్రిల్ నెల పుట్టింది.
Also read: ప్రపంచం అంచులకు వెళ్లిన ఫీలింగ్ కావాలా, ధనుష్కోడిలోని ఆ ప్రాంతానికి వెళితే సరే
Also read: ప్రపంచంలో అత్యధికంగా దోపిడీకి గురవుతున్నవి ఇవే, వాటిలో మొదటి స్థానం దేనిదో తెలుసా?