కొందరు ఆఫీసులు ఉదయానే ఏడుగంటల షిప్ట్‌కే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు కూడా స్కూలు బస్సు కోసం ఏడుగంటలకే రెడీ అవ్వాలి. దీంతో తల్లులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ వండడం కష్టంగా మారుతుంది. సులువుగా వండే బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు తెలుసుకుంటే పెద్ద కష్టపడకుండా అప్పటి కప్పుడే టిఫిన్ రెడీ చేసి పెట్టేయచ్చు. 


శెనగపిండి దోశె
కావాల్సినవి
శెనగపిండి - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పసుపు - చిటికెడు
పచ్చి మిర్చి - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - సరిపడినంత


తయారీ ఇలా
1. గిన్నెలో శెనగపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. 
2. నీళ్లు కలిపి దోశెల పిండిలా కలుపుకోవాలి. 
3. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. 
4. నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. 
5. పెనంపై నూనె రాసి దోశెలా వేసుకుంటే సరి. పదినిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. 
..............................


జొన్న దోశె
కావాల్సినవి
జొన్న పిండి - ఒక కప్పు
పెరుగు - అరకప్పు
ఉల్లిపాయ - అర ముక్క
టొమటో - అర ముక్క
క్యాప్సికమ్ - అర ముక్క
ధనియాల పొడి - అర స్పూను
యాలకుల పొడి - అర స్పూను
గరం మసాలా పొడి - పావు స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - సరిపడినంత


తయారీ ఇలా
1. ఒక గిన్నెలో జొన్నపిండిని వేసి ఉప్పు, మసాలాలు కలుపుకోవాలి. 
2. పెరుగు కూడా వేసి బాగా గిలక్కొట్టాలి. దోశెలు పోసుకోవడానికి వీలుగా వచ్చేలా నీరు వేసి కలుపుకోవాలి. 
3. ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికం, కొత్తిమీర వంటివి సన్నగా తరుక్కోాలి. వాటిని పిండిలో కలపాలి. 
4. స్టవ్ పై పెనం పెట్టి పైన నూనె రాసి దోశెలు పోసుకోవాలి. 
..................


బియ్యం దోశెలు
కావాల్సిన పదార్థాలు
బియ్యం పిండి - ఒక కప్పు
ఉల్లిపాయ - అర ముక్క
టొమాటో - అర ముక్క
క్యాప్సికం - ఒక ముక్క
పచ్చిమిర్చి - ఒకటి
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు
జీలకర్ర పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత


తయారీ ఇలా
1. ఒక గిన్నెలో బియ్యం పిండి వేసి నీళ్లు కలపాలి. ఉండల్లేకుండా బాగా గిలక్కొట్టాలి. ఉప్పు వేయాలి. 
2. ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికం, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులు వేసి బాగా కలపాలి. 
3. జీలకర్ర పొడి కూడా వేసి కలపాలి. 
4. దోశెలు పోసేంత వీలుగా పిండిని కలుపుకోవాలి. అవసరం అయితే నీళ్లు కలుపుకోవచ్చు. 
5. ఆ పిండిని దోశెల్లో పోసుకోవాలి.
6. ఏ చట్నీతో తిన్నా ఇవి టేస్టగానే ఉంటాయి. 


పైన చెప్పిన దోశెలన్నీ కేవలం పదినిమిషాల వ్యవధిలోనే రెడీ అవుతాయి. పిల్లల టిఫిన్ బాక్సు రెపిసీలుగా ఉపయోగపడతాయి. పైగా వాటిలో పోషకాహార విలువలు కూడా అధికం.
Also read: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి


Also read: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు