డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక జీవక్రియ వ్యాధి. ప్రపంచంలో లక్షల మంది దీని బారిన పడుతున్నారు. ఇది ఒకసారి ఒంట్లో చేరిందంటే తిరిగిపోవడం చాలా కష్టం. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అయితే మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితేనే ఇది ఇబ్బంది పెడుతుంది. పెరగకుండా చూసుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు. మనదేశంలో గత నాలుగేళ్లలోనే మధుమేహం కేసులు 44 శాతం పెరిగాయి. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు భారత్‌లో మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల ఆహారాలు మధుమేహాన్ని నిర్వహించడానికి సహాయపడతాయి. వాటిని రోజువారీ ఆహారంలో కచ్చితంగా తినాలి.


కాకరకాయ
ఇది చేదుగా ఉన్నా కూడా ఎన్నో ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలం. ఆయుర్వేదం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. దీనిలో ఉండే పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. కాకరకాయ గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు ఇన్సులిన్ హార్మోనును ఉత్పత్తి అయ్యేలా ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది.


నేరేడు పండ్లు
ఇవి వానాకాలంలో మాత్రమే దొరికే సీజనల్ పండ్లు. ఇండియన్ బ్లాక్ బెర్రీగా పిలుచుకుంటారు. దీనిలో హైపోగ్లైసిమిక్ ప్రభావాలు ఎక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్, పాలిఫెనాల్స్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. నేరేడు పండ్లను నేరుగా తినడం లేదా రసం తీసుకుని తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుంది. మధుమేహం వల్ల కలిగే ఇబ్బందులు ఏవీ దరి చేరవు. దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరం చక్కెరను శోషించుకోకుండా అడ్డుకుంటుంది.


తిప్పతీగ
ఇది ఒక తీగ జాతి మొక్క. ఈ మొక్క ఆకుల రసాన్ని తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఆ రసాన్ని తాగితే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణం... ప్యాంక్రియాటిక్ బీటా కణాలను రక్షించేందుకు సహాయపడతాయి. మధుమేహంతో సంబంధం ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది.


ఉసిరి
ఉసిరి కూడా సీజనల్ గానే దొరుకుతుంది. ఉసిరికాయలను రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్యాంక్రియాటిక్ పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండేటట్టు చూస్తాయి. ఉసిరి ఆక్సికరణ ఒత్తిడిని, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది.


Also read: ఆల్కహాల్ తాగే ముందు ఆహారం కచ్చితంగా తినాల్సిందేనా?



read: ప్రపంచంలోనే ప్రమాదకరమైన చెట్లు ఇవి, వీటి కింద నిలుచున్నా ప్రాణాపాయమే























































































































































































































































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.