మద్యం చేసే చెడు గురించి తెలిసినా కూడా రోజూ ఆల్కహాల్ తాగే వారి సంఖ్య అధికంగానే ఉంది. పడుకోబోయే ముందు రెండు, మూడు పెగ్గులు వేస్తే కానీ నిద్రపోని వారి సంఖ్య ఎక్కువే. అయితే ఖాళీ పొట్టతో ఆల్కహాల్ తాగడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. ఆల్కహాల్ తాగాక ఆహారం తినడం వల్ల అజీర్తి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఆల్కహాల్ తాగడానికి ముందే పోషకాహారాన్ని తినమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఆల్కహాల్ తాగాక అది పొట్టలోకి చేరి చిన్న పేగు ద్వారా మీ రక్తంలోకి ప్రవేశిస్తుంది. పొట్ట ఖాళీగా ఉంటే ఆల్కహాల్ మీ రక్తంలోకి నేరుగా వెళ్లి కలిసిపోతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. అందుకే ఈ పానీయం తాగడానికి ముందు ఏవైనా పోషకాహారాన్ని తినడం చాలా మంచిది. పొట్టలో ఉన్న ఆహారంలోని నీటి కంటెంట్ మీరు తాగిన మద్యాన్ని పలచగా మారుస్తుంది. ఆల్కహాల్ తాగేసరికే పొట్టలో ఆహారం ఉంటే, ఆ ఆహారంలోని ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్ వంటివి ఆల్కహాల్‌ను శరీరం శోషించుకోవడం నెమ్మదించేలా చేస్తాయి. దీనివల్ల ఆల్కహాల్ రక్తంలో ఎక్కువగా కలిసే అవకాశం ఉండదు. ఆరోగ్యకరమైన ఆహారం మీ శరీరంలో ఆల్కహాల్ వల్ల క్షీణించే విటమిన్లను, ఖనిజాలను తిరిగి అందిస్తుంది. 


మద్యం తాగుతున్నప్పుడు స్నాక్స్ తినాలనిపిస్తే, ఉప్పు కలిపిన స్నాక్స్ కు దూరంగా ఉండాలి. దీనివల్ల మీకు దాహం పెరిగిపోతుంది. శరీరంలో డిహైడ్రేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆల్కహాల్ వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇక మద్యంతో పాటు ఉప్పు నిండిన చిరుతిండి తినడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఇంకా పెరిగిపోతుంది. ఆల్కహాల్ తాగడానికి ముందు పండ్లు, కూరగాయలు వంటివి తినేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన పండ్లు తినడం, దోసకాయ, టమోటోలు, క్యాప్సికం, ముల్లంగి, అరటి కాయ వంటి వాటితో వండిన వంటలను తినడం చేయాలి. ఆల్కహాల్ తాగేముందు అరటిపండును తింటే ఇంకా మంచిది. దీనిలో ఫైబర్, నీటి కంటెంట్  పుష్కలంగా ఉంటాయి.


మద్యం శరీరంలోకి ఎక్కువగా శోషణకు గురైతే మీరు త్వరగా ముసలివాళ్ళు అయిపోతారు. శరీరం సన్నబడిపోతుంది. వయసు త్వరగా పెరిగినట్టు కనిపిస్తారు. 30 ఏళ్లకే నలభై ఏళ్ల వయసు వచ్చినట్టు కనిపిస్తారు. కాబట్టి ఆల్కహాల్‌ను తాగడం తగ్గించాలి. ఆల్కహాల్ శరీరంలో ఎక్కువగా శోషణకు గురవ్వకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అధికంగా తినాలి. ఆల్కహాల్ తాగడానికి పావుగంట ముందే పోషకాహారాన్ని తినాలి. రాత్రి భోజనాన్ని సుష్టుగా చేశాకే మద్యం గ్లాసు ముట్టుకోవాలి. నిజానికి మద్యం మానేస్తేనే ఆరోగ్యం. కానీ ఎంత చెప్పినా ధూమపానం, మద్య పానం వంటివి మానేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. అలాంటి వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుని మద్యపానం చేస్తే కాస్తయిన ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారవుతారు. 


Also read: నిద్రపోయేటప్పుడు లైట్లు వేసుకుని నిద్రపోకూడదా? వెలుగుకు, నిద్రకు మధ్య సంబంధం ఏంటి?


Also read: ప్రపంచంలోనే ప్రమాదకరమైన చెట్లు ఇవి, వీటి కింద నిలుచున్నా ప్రాణాపాయమే























































































































































































































































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.