దయం నుంచి సాయంత్రం వరకు పరుగులు పెట్టే జీవనశైలికి అలవాటు పడిపోయాం. నిద్ర లేస్తూనే హడావుడిగా తయారైపోయి ఎవరి పనుల్లో వాళ్లం మునిగిపోతున్నాం. ఈ బిజీలో ఆరోగ్యం గురించి పట్టించుకోవటం లేదు. ఉదయమే లేచి వాకింగ్ చేయటమో, జిమ్‌కు వెళ్లటమో లాంటివి చేసి ఆ తరవాత ఆఫీస్‌లకు వెళ్లిపోతారు. కానీ ఒళ్లు వంచి వ్యాయామం చేసే వాళ్లు తక్కువ మందే ఉంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పక్కన పెట్టి ఫాస్ట్‌ఫుడ్‌నే ఆరగించటమూ సమస్యలు తెచ్చి పెడుతోంది. ఈ నిర్లక్ష్యమే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి ప్రాణాల మీదకు తెస్తోంది. గుండెపోటు మరణాలకు అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఈ ముప్పు నుంచి 
తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు వైద్యులు. 


ఈ ఆహారంతో గుండె పదిలం: 


రీరంలో గుండె చాలా కీలకమైన అవయవం. అది ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అన్నేళ్లు ఆనందంగా జీవించేందుకు అవకాశముంటుంది. సమతుల ఆహారంతో గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. 
1. గుండె నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే పీచు పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి. రక్తపోటుతో పాటు రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో 
ఉంచాలన్నా ఫైబర్ ఫుడ్ తీసుకోవాల్సిందే. ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, యాపిల్స్, ఆకుకూరల్ని రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
2. ఫోలేట్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం ద్వారా గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. బీన్స్, సిట్రస్ ఫ్రూట్స్, కూరగాయలు ఆహారంగా తీసుకుంటే గుండె పదిలంగా ఉంటుంది. 
3. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె రక్త నాళాలు గడ్డ కట్టకుండా కాపాడతాయి. గుండె కండరాలనూ ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ వాల్‌నట్స్‌ని తింటే ఒమెగా-3ఫ్యాటీ యాసిడ్స్‌ గుండెకు పుష్కలంగా అందుతాయి. 
4. శరీరానికి మంచి చేసే కొవ్వులు కూడా ఉంటాయి. ఇలాంటి మంచి కొవ్వుని అందించే ఆహార పదార్థాల్లో అవకాడో చాలా ముఖ్యమైంది. నట్స్, సీడ్స్‌లోనూ శరీరానికి మంచి చేసే కొవ్వు ఉంటుంది. 
5. మీకు గుండె జబ్బులు రాకూడదంటే డార్క్ చాక్లెట్ తినండి అని చెబుతున్నారు వైద్యులు. అందుకు కారణం..అందులో ఉండే మెగ్నీషియం. గుండె సంబంధిత జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం మెగ్నీషియంలో ఉంటుంది. ఆహార ధాన్యాలన్నింటిలోనూ మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ సరైన మోతాదులో తీసుకుంటే గుండె భద్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సూచనలు పాటిస్తే గుండె జబ్బుల గండం నుంచి సులువుగా బయట పడొచ్చు. 


Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!


Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు