Heart Attack Symptoms in Summer : గుండెపోటు రావడానికి వివిధ కారణాలు ఉండొచ్చు. అసలు హార్ట్​ ఎటాక్​ ఎందుకు వస్తుందంటే.. గుండె కండరాల్లో ఏదైనా భాగానికి రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. కణజాలానికి ఆక్సిజన్, పోషకాల కొరత ఏర్పడి.. గుండెకు తీవ్రమైన నష్టాన్ని, నొప్పిని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంకమవుతుంది. సమ్మర్​లో ఈ తరహా కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. ఎండవేడివల్ల కూడా హార్ట్​ఎటాక్​ వస్తుంది. 


గుండెపోటుకు అత్యంత ప్రధానమైన లక్షణం ఛాతీలో నొప్పి రావడం. అయితే కేవలం ఈ లక్షణమే కాదు.. శరీరంలోని వివిధ రకాల నొప్పులు కూడా గుండెలోని అసౌకర్యాన్ని, బాధను సంకేతాలని చెప్తున్నారు. ఒకవేళ ఈ సంకేతాలు మీరు ముందుగా గుర్తిస్తే.. వెంటనే వైద్య సేవలు తీసుకోవచ్చు. ఇంతకీ గుండెపోటును తెలిపేందుకు శరీరం ఇచ్చే సంకేతాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.


ఛాతీ నొప్పి


ఛాతీలో నొప్పి రావడం. ఒత్తిడి ఎక్కువై.. బిగుతుగా అనిపించడం అత్యంత ప్రధాన లక్షణం. అయితే ఇది కొన్ని సందర్భాల్లో కొన్ని నిమిషాలే ఉండొచ్చు. లేదా వచ్చి వెళ్లిపోతుంది. అది పెద్ద ప్రమాదం కాకపోవచ్చు. కానీ.. ఛాతీలో తీవ్రమైన నొప్పితో పాటు.. శ్వాస ఆడకపోవడం, తలతిరగడం వంటి సంకేతాలు గుర్తిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. గుండె నుంచి నొప్పి భుజాలు, చేతులు, దవడ, మెడ, వీపు, కడుపు వైపు వ్యాపిస్తుంటే.. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. 


ఎడమవైపు నొప్పి.. 


గుండెపోటు వల్ల చేతులు, భుజాలు, మెడ, దవడ, వీపు ప్రాంతాల్లో నొప్పి ఎక్కువగా వస్తుంది. ఇది రెండువైపులా వస్తుంది కానీ.. తరచుగా ఎడమవైపు మీరు ఈ నొప్పిని పొందుతుంటే జాగ్రత్త పడాలి. నీరసం వల్ల ఇలా జరగొచ్చు. లేదా గుండె సమస్యల వల్ల కూడా ఇది జరిగే ప్రమాదముంది. శరీరంలోని ఏ ప్రాంతంలో అయినా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్య సేవలు తీసుకోవాలి. వాటితో పాటు ఛాతీ నొప్పి వస్తే కచ్చితంగా వెళ్లాలి. 


వికారం, వాంతులు.. 


వాంతులు, వికారం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలుగా అనుకుంటారు. సమ్మర్​లో ఇవి కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే గుండెపోటు సమయంలో కూడా వికారం, వాంతులు, అజీర్ణం వంటి లక్షణాలు ఉంటాయట. గుండెపోటు వల్ల శరీరం ఒత్తిడికి ఇచ్చే రియాక్షనే వికారం. ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. అయితే మీకు వికారంతో, వాంతులతో పాటు గుండెదగ్గర నొప్పి అనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. 


ఊపిరి ఆడడంలో ఇబ్బంది.. 


ఊపిరి ఆడకపోవడాన్ని వివిధ సందర్భాల్లో మనం ఫీల్ అవుతాము. అయితే ఏమి చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు.. అలాగే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లేదా తేలికపాటి పనులు చేస్తున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. గుండె రక్తాన్ని పంప్ చేయడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు అది ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఛాతీ నొప్పి ఉంటూ.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లాలి. 


తల తిరగడం


ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తరహా లక్షణం ఎక్కువగా చూస్తాము. మూర్ఛ ఉన్నవారికి కూడా ఈ లక్షణం ఉంటుంది. అయితే గుండెపోటుకు కూడా ఇది ఒక సంకేతమే. గుండె.. మెదడుకు తగినంత రక్తాన్ని పంప్ చేయకపోతే.. రక్తపోటు వస్తుంది. ఇది మీకు కళ్లు తిరిగేలా చేస్తుంది. దీనివల్ల మీకు వీక్​గా అనిపించి.. నిలబడే ఓపిక కూడా ఉండదు. కళ్లు తిరుగుతూ గుండె నొప్పి ఉంటే వైద్యుల దగ్గరకు వెళ్లాలి. 


ఇవే కాకుండా సడెన్​గా చెమటలు పట్టడం, చీలమండలంలో వాపు, గుండె దడ వంటివి గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఈ సంకేతాలు తెలుసుకోవడం, గుర్తించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. వీటిలో మీకు ఏ అనుభూతి ఉన్నా వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లిపోండి. 




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.