మార్చి 25 బుధవారం రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరున్న రంగంలో కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు మంచి ప్రయోజనం పొందుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి.
వృషభ రాశి
ఈ రోజు మీరు అసంపూర్ణ రచనలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. సోమరితనం ప్రభావం మీ కార్యాచరణపై పడుతుంది. విద్యార్థులు అనవసర విషయాలు వదిలేసి చదువుపై శ్రద్ధపెట్టాలి. స్నేహితులను కలుస్తారు
మిథున రాశి
మీ తప్పులను ఇతరులపై విధించవద్దు. మీపై ఉండే నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ఒకరి ఒత్తిడి మీపై కనిపిస్తుంది. ఆర్థిక రంగంతో సంబంధం ఉన్నవారికి చాలా ఇబ్బందులుంటాయి. తొందరగా అలసిపోతారు
కర్కాటక రాశి
ఈ రోజు మీరు కెరీర్ గురించి చాలా సానుకూలంగా ఉంటారు. స్నేహితులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితం గురించి చాలా ఆశాజనకంగా ఉంటుంది. అన్ని చర్యలను ప్రణాళికాబద్ధంగా చేయండి. వ్యాపారంలో అధిక ప్రయోజనాలు పొందుతారు.
సింహ రాశి
ప్రత్యర్థులు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు. మీ సమయాన్ని ఫలించని పనులలో వృథా చేయవద్దు. బయట ఆహారంపై ఆసక్తి చూపించవద్దు. మీ కోపాన్ని నియంత్రించడానికి ప్రయత్నించండి.
కన్యా రాశి
ఈ రోజు ఉన్నతాధికారులతో సంబంధాన్ని పాడుచేసుకోవద్దు. శత్రువులు పొంచి ఉన్నారు జాగ్రత్త. మార్కెటింగ్ సంబంధిత పరిధిలో లాభాల అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. అధిక ఆలోచనలు చేయవద్దు
తులా రాశి
ఈ రోజు స్నేహితులతో సమయం స్పెండ్ చేస్తారు. కుటుంబం బాధ్యతలు కొంత అసౌకర్యానికి గురిచేస్తాయి. వైవాహిక జీవితంతో సమస్యలుంటాయి. పరిస్థితులను ఎదుర్కొను అడుగువేసే ఆత్మస్థైర్యం ఉంటుంది
వృశ్చిక రాశి
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. అతి ప్రవర్తన తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు.
ధనస్సు రాశి
వ్యాపారంలో ఊహించిన స్థాయిలో ప్రయోజనాలు పొదడం కష్టమే. శత్రువులు మీ పనిలో అడ్డంకిగా మారవచ్చు. జీవితంలో కొన్ని మార్పులు వచ్చే సమయం ఇది. కోపం, తొందరపాటుతనం వల్ల చేపట్టిన పనులు చెడిపోతాయి. నిరాశను దరిచేరనివ్వొద్దు. వివాదాస్పద కేసులలో స్పందించవద్దు.
మకర రాశి
ఈ రోజు ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. సహోద్యోగులతో మీ ప్రవర్తన సరిగా ఉంచండి. వ్యాపారం బాగానే ఉంటుంది. ఆర్థరైటిస్ రోగుల సమస్య పెరగొచ్చు.
కుంభ రాశి
ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రైవేట్ సంస్తల్లో పనిచేసే ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. ఊహించని సమస్యల వల్ల వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య సమ్యలున్నాయి.
మీన రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఓ తీవ్రమైన సమస్య గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. రోజువారీ పనుల గురించి కొంత ఆందోళన ఉంటుంది. సన్నిహితుల ప్రవర్తనపై నిఘా ఉంచండి.
ఉగాది 2025 - శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ మీ రాశి ఫలితం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.