Facebook Instagram Down: సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయ్యాయి. ఫీడ్‌ను అప్‌డేట్ చేయడం, పోస్ట్ చేయడం, కామెంట్‌లు చదవడం, లాగిన్ అవ్వడంలో కూడా వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. చాలా మంది వినియోగదారులు దీని గురించి Xలో పోస్ట్ చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఉపయోగించడంలో తమకు ఇబ్బంది ఉందని, ఫీడ్‌ అప్‌డేట్ కావడం లేదని వినియోగదారులు రాసుకొచ్చారు. ఈ రోజుల్లో లక్షలాది మంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు వినియోగిస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు, పోస్టులు కనిపిస్తున్నాయని వాటిని ఓపెన్ కావడం లేదు. పోస్టులకు వాటిపై కామెంట్స్ చేయాలన్నా కుదరడం లేదని ఫిర్యాదులు చేశారు. మరికొందరు తాము కామెంట్స్ చేసినా, పోస్టులు పెట్టినా కనిపించడం లేదని అన్నారు. వారం రోజు క్రితం అంటే మార్చి 19న కూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి సమస్య ఎదురైంది. 
చాలా మంది వినియోగదారులు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎందుకు డౌన్ అయ్యాయి అనేది ఇంకా తెలియదు. ఈ అంతరాయంపై మెటా ఇంకా స్పందించలేదు.