Heart Disease In women: హార్ట్ ఎటాక్ అనగానే పురుషులకే వస్తుంది అనుకునేవాళ్లం.  కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మహిళలకు  కూడా గుండెపోటు వస్తుంది. గత కొన్నాళ్లుగా మహిళల్లో ఈ ప్రమాదం పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో గుండెపోటు గురై మరణించిన మహిళల సంఖ్య కూడా పెరిగింది. అయితే  పురుషులతో పోలిస్తే మహిళలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే సూక్ష్మంగా ఉంటాయట. మహిళల్లో గుండెపోటు లక్షణాలను ముందుస్తుగా గుర్తించడం చాలా కష్టం. అయితే కొన్ని లక్షణాల ద్వారా గుండెపోటును గుర్తించవచ్చు అంటున్నారు కార్డియాలజిస్ట్ నిపుణులు. మహిళల్లో గుండె పోటు లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. 


గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపే  మెనోపాజ్ వంటి హార్మోన్ల మార్పులతో సహా పలు కారణాల వల్ల మహిళలు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు కూడా  గుండె జబ్బులకు కారణం అవుతాయి. ధూమపానం, అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి జీవనశైలి అలవాట్లు కూడా హార్ట్ ఎటాక్ కారణాలే. ఇవే  కాదు ఒత్తిడి అనేది  ఆటో ఇమ్యూన్ వ్యాధులు ప్రమాదాన్ని మరింత పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే సూక్ష్మంగా ఉంటాయి. ఈ లక్షణాలను ముందస్తుగా గుర్తించడం సవాలుతో కూడినదే.  మహిళల్లో గుండెపోటు  ఎనిమిది సాధారణ లక్షణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 


ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం :


సాధారణంగా ఎడమ వైపు లేదా మధ్యలో ఛాతీలో ఒత్తిడి, లేదా ఆయాసంగా అనిపిస్తుంది. ఇలా ఆయాసం కొన్ని నిమిషాలపాటు ఉంటుంది.కొన్నిసార్ల తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరగబెడుతుంది. ఈ లక్షణం ఒక క్లాసిక్ సంకేతం. కానీ  మహిళల్లో తీవ్రత ఎక్కువగా ఉండకపోవచ్చు. 


ఇతర ప్రాంతాలలో నొప్పి :


గుండెపోటు నుంచి నొప్పి నెమ్మదిగా వీపు, మెడ, దవడ లేదా చేతులకు పాకుతుంది. ఈ నొప్పి ఛాతీకి సంబంధం లేనట్లే అనిపిస్తుంది. కానీ ఇది గుండెపోటు సంబంధిత లక్ష్ణణంగా పరిగణించాలని వైద్యులు చెబుతున్నారు. 


శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:


చాలా మంది మహిళలు ఛాతీలో నొప్పి ఉంటే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఈ లక్షణం అకస్మాత్తుగా లేదంటే ఏదైనా పని చేస్తుంటే వస్తుంది. ఛాతీలో ఆయసంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 


వికారం లేదా వాంతులు :


వికారం లేదా వాంతులు సహా జీర్ణశయాంతర సమస్యలు  కూడా గుండెపోటు లక్షణాలే. ఈ లక్షణాలు కొన్నిసార్లు ఇతర జీర్ణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటాము. 


అసాధారణ అలసట :


శారీరక శ్రమతో సంబంధం లేని విపరీతమైన అలసట గుండెపోటు లక్షణమే. ఈ అటసట తరచుగా వస్తుంది. తీవ్రంగా స్థాయిలో ఉంటుంది. విశ్రాంతి తీసుకున్న సమయంలో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.  


 తలతిరగడం :


మూర్ఛ లేదా తలతిరినట్లుగా అనిపిస్తే అది గుండెపోటును సూచిస్తుంది. రక్తప్రసరణ తగ్గడం వల్ల కూడా మూర్చపోతున్నట్లు తలతిరగటం వంటి లక్షణాలు ఉంటాయి. 



చల్లని చెమట :


చాలామందికి విపరీతమైన చమటలు వస్తుంటాయి. చల్లగా చెమటలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది గుండెపోటు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. 


అజీర్ణం లేదా గుండెల్లో మంట :


 అజీర్ణం లేదా గుండెల్లో మంట కూడా కొన్నిసార్లు  కొన్నిసార్లు గుండెపోటుకు కారణం అవుతాయి. ఈ లక్షణాలు గందరగోళంగా ఉంటాయి. జీర్ణసంబంధిత లక్షణాల వలే ఉంటాయి.


Also Read : కాఫీ అంటే ఇష్టమా? అయితే ఈ ఒక్క మార్పు చేసి కాఫీ తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది, బరువు తగ్గుతారు 
.