Healthy Coffee Habits : కాఫీని ఎక్కువ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని.. పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు వైద్యులు. డాక్టర్ చెప్పారని దానిని కంట్రోల్ అయితే చేస్తారు కానీ.. అస్సలు తాగకుండా ఉండమంటే మాత్రం కష్టమనే అంటారు. అయితే కాఫీ పూర్తిగా మానేయకుండా ఈ ఒక్క మార్పు చేసి.. లిమిటెడ్​గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు పరిశోధకులు. పలు అధ్యయనాలు దానికి ఊతమిస్తున్నాయి. ఇంతకీ ఆ మార్పు ఏమిటి? 


కాఫీలో ఎవరైనా షుగర్ వేస్తాను అంటే నో అని చెప్పండి. అమ్మో కాఫీలో పంచదార లేకుంటే ఎలా అనుకోవద్దు. ఎందుకంటే.. కాఫీలో షుగర్ వేసుకోకుండా లిమిటెడ్​గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. మధుమేహం, గుండె జబ్బులు, నిద్ర, స్కిన్ వంటి సమస్యలను ఇది కంట్రోల్ చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. పాలు కూడా లేకుండా సాదా బ్లాక్ కాఫీని లిమిటెడ్​గా తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయంటున్నారు పరిశోధకులు. 


మధుమేహాన్ని తగ్గిస్తుంది.. 


కాఫీలో పంచదార కలిపి తీసుకోవడం వల్ల మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 8 శాతం ఎక్కువ ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ తెలిపింది. కాఫీలో షుగర్​, స్వీట్​నెర్స్ కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కానీ పంచదార లేకుండా సాధా కాఫీ తాగితే.. ఈ ప్రమాదాన్ని 8 శాతం తగ్గించవచ్చు అంటున్నారు. అయితే కొన్ని అధ్యయనాలు కెఫీన్ కూడా ఇన్సులిన్​ సెన్సిటివిటీని దెబ్బతీస్తుందని చెప్తున్నాయి. కాబట్టి చక్కెర లేకుండా కాఫీ తాగినా.. దానిని లిమిటెడ్​గా తీసుకోవాలి. 



హార్ట్​కి మంచిది..


ప్రతి ఏటా గుండె సమస్యలతో ఎందరో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కార్డియోవాస్కులర్​ ప్రజలపై తీవ్ర పరిణామాలు చూపిస్తుంది. అయితే కెఫీన్ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. కాఫీ గుండె ఆరోగ్యానికి మంచిదే కానీ.. షుగర్​ లేకుండా తీసుకుంటే దీని ప్రభావం బాగుంటుంది. 


మైండ్ యాక్టివ్​గా ఉంటుంది.. 


మీరు కొన్ని విషయాలు తరచుగా మరచిపోతున్నారా? జ్ఞాపకశక్తికి ఉండట్లేదా? అయితే మీరు ఓ కప్పు కాఫీని తాగవచ్చు. ఇది మైండ్​ని యాక్టివ్​గా ఉంచి.. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ విషయాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. చక్కెర దీనికి వ్యతిరేకంగా పని చేస్తుంది కాబట్టి దానిని తీసుకోకపోవడమే మంచిది. 


బరువు తగ్గేందుకు.. 


బరువు తగ్గాలని చూస్తున్నారా? అయితే మీరు మీ డైట్​లో కాఫీ చేర్చుకోవచ్చు. ఓ జర్నల్​లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం కెఫిన్ బరువు తగ్గించడంలో సహాయం చేస్తుందని గుర్తించారు. ఇది శక్తితో పాటు.. మెటబాలీజంను పెంచి.. బరువును వేగంగా తగ్గించడంలో సహాయం చేస్తుంది. దీనివల్ల ఎక్కువ కేలరీలు కరుగుతాయి. కాలేయంలోని కొవ్వును కూడా తగ్గించి..  ఊబకాయం సమస్యలు రాకుండా చేస్తాయి. 


రక్తపోటు కంట్రోల్ అవుతుంది.. 


అధికరక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి దానిని కంట్రోల్​లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఓ అధ్యయన కాఫీ తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందని తెలిపింది. దీనిని మితంగా, షుగర్​ లేకుండా తీసుకోవాలి. పంచదార కలిపి తీసుకుంటే సమస్యలు ఎక్కువ అవుతాయి. 


ఇవే కాకుండా పళ్ల సమస్యలు రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. అందుకే చక్కెర లేకుండా కాఫీని మితంగా తీసుకోవాలంటున్నారు. ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కొన్ని సమస్యలున్నవారు దీనికి దూరంగా ఉండాలంటున్నారు. జీర్ణ సమస్యలు, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలను ఇది దూరం చేస్తుంది. ఒకవేళ మీకు కాఫీ అలెర్జీ ఉంటే దాని జోలికి అస్సలు వెళ్లకపోవమే మంచిది. 


Also Read : ఇన్​స్టాగ్రామ్​లో ఫుడ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి