Seethe Ramudi Katnam Today Episode కిరణ్ రేవతితో ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని ఇక లేట్ చేయలేను అని ఏ గుడిలో అయినా లేక రిజిస్టర్ ఆఫీస్‌లో అయినా పెళ్లి చేసుకుందామని కిరణ్ అంటే రేవతి సీత నెల రోజులు టైం ఇచ్చింది కదా అప్పటి వరకు ఆగుదామని రేవతి అంటుంది. సీత తాను చెప్పినట్లు పెళ్లి అన్నవదినల చేతుల మీదుగా చేయిస్తుందని రేవతి కిరణ్‌కి సర్దిచెప్తుంది. దాంతో కిరణ్‌ నెల రోజులు ఆగుదామని ఆ తర్వాత సీత వల్ల కాకపోతే మనమే ఎక్కడైనా పెళ్లి చేసుకుందామని అంటుంది. 


మహాలక్ష్మి: సీత విషం కలిపినట్లు మాట్లాడటం సీత మీద నిందలు వేస్తే సీతని తీసుకొని వేరు ఇంటికి వెళ్తానని తనని ఎదురించి రామ్ మాట్లాడటం గుర్తు చేసుకొని... ఛా నా పరువు అంతా పోయింది మొదటి సారి నా పొజిషన్ అపొజిషన్ అయింది.
ప్రీతి: పిన్ని.
మహాలక్ష్మి: ఏంటి.. కోపంగా.
ప్రీతి: ఏమైంది పిన్ని అలా ఉన్నావ్. 
మహాలక్ష్మి: నిన్ను మీ అన్నయ్యని సొంత పిల్లలుగా అనుకున్నందుకు నాకు తగిన శాస్త్రి జరిగింది. ఎవర్నీ అతిగా ప్రేమించకూడదు. ఈ ఇంట్లో ఎన్నో జరుగుతున్నాయి అయినా అవన్నీ నీకు ఎందుకు ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావ్ నీకు నాతో ఏం పని. 
ప్రీతి: పిన్ని నాకు రేపు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్ ఉంది నన్ను మీరు మోడ్రన్గా రెడీ చేయాలి.


మహా కోపంతో ప్రీతిని తిట్టేస్తుంది. నేను ఇరిటేషన్లో ఉంటే నువ్వు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటూ వచ్చావని మహాలక్ష్మి తిట్టేస్తుంది. అన్నింటికి పిన్ని పిన్ని అంటారు అవసరం తీరాక తిట్టేస్తారని అంటుంది. ప్రీతి ఏడుస్తూ వెళ్లిపోతుంది. మరోవైపు సీత డైనింగ్ టేబుల్ దగ్గర టిఫెన్స్ కి రండి ఈ సారి విషం ఏం కలపలేదు తినండి అంటుంది. రామ్‌తో పాటు అందరూ వచ్చి కూర్చొంటారు. సీతే అందరికీ టిఫెన్ వడ్డిస్తుంది. ఇంతలో ప్రీతి చీర కట్టుకొని అందంగా రెడీ అయి మేడ మీద నుంచి కిందకి దిగుతుంది. అందరూ ప్రీతిని చూసి చాలా సంతోషిస్తారు. చాలా అందంగా ఉన్నావని పొగుడుతారు. ఇక మహాలక్ష్మి ప్రీతిని తిట్టిన విషయం గుర్తు చేసుకుంటుంది. అందరూ ప్రీతిని మహానే రెడీ చేసిందని మహాలక్ష్మిని పొగుడుతారు. దానికి ప్రీతి తనని రెడీ చేసింది విద్యాదేవి టీచర్ రెడీ చేశారని చెప్తుంది. ఇక విద్యాదేవి కిందకి వస్తుంది. మహా కోపంతో ఉంటుంది. రామ్, సీతలు విద్యాదేవిని పొగిడేస్తారు. తనని గతంలో సుమతి చీర రెడీ చేసిన విషయం గుర్తు చేసుకుంటుంది.


మహాలక్ష్మి ప్రీతి డ్రెస్ బాగుందని చెప్పి ఆల్‌ది బెస్ట్ చెప్తే ప్రీతి పట్టించుకోకుండా విద్యాదేవికి చెప్పి వెళ్తుంది. ప్రీతిలోనూ మార్పు మొదలైందని సీత అనుకుంటుంది. విద్యాదేవి టీచర్‌కి సుమతికి ఏదో కనెక్షన్ ఉందని మహాలక్ష్మి అనుకుంటుంది. ఇక విద్యాదేవి ఓ పేపర్ మీద రామ్, ప్రీతి, జనార్థన్‌లతో తాను కలిసి ఉన్నట్లు ఉన్న స్కెచ్‌ చూస్తూ ఉంటుంది. ఇక జనార్థన్‌ విద్యాదేవి దగ్గరకు వస్తాడు. ఆ స్కెచ్‌ జనా చూడకుండా విద్యాదేవి దాచేస్తుంది. ఇక జనార్థన్‌ విద్యాదేవికి థ్యాంక్స్ చెప్తాడు. జనా, విద్యాదేవిల మాటలు మహాలక్ష్మి వింటుంది. ఇక జనార్థన్ విద్యాదేవికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. విద్యాదేవి ఎమోషనల్ అయితే మహాలక్ష్మి కోపంతో రగిలిపోతుంది. విద్యాదేవి అచ్చం సుమతిలా ప్రవర్తిస్తుందని ముఖం చూస్తే సుమతిలా లేదు ఏమై ఉంటుందా అని మహాలక్ష్మి అనుకుంటుంది.


మధు బట్టలు ఆరేస్తూ జలజని తన సొంత అక్కలా చూసుకుంటే తను మాత్రం వెనక గోతులు తవ్విందని ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి సూర్యకు దగ్గరవ్వాలి అనుకుంటుంది. ఇంతలో సూర్య వస్తాడు. సూర్య దగ్గరకు వెళ్లి కొన్ని బట్టలు ఉన్నాయి ఆరేసి వచ్చి భోజనం పెడతానని అంటుంది. అక్క బావ బయటకు వెళ్లారని నీకు నచ్చిన వంటలే వండానని చెప్పి వడ్డిస్తుంది మధు. సూర్య మాటలాడకుండా తింటాడు. మధు సూర్యకి క్షమాపణలు చెప్పి జరిగినవన్నీ మర్చిపోయి నాకు నువ్వు నీకు నేను మన మధ్య ఇంకెవరూ వద్దని అంటుంది. సూర్య సగం తిని చేయి కడుక్కొని లేచేస్తాడు. మధుని దూరం పెడతాడు. నిజంగానే నువ్వు నాతో ఉండిపోవాలని అనుకున్నావా.. కాలు లేని వాడితో నువ్వు ఉండలేవని సూర్య అంటాడు. నాతో ఉండలేవని మధుతో అంటాడు. 


మరోవైపు ప్రీతి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్‌లో గెలిచి వస్తుంది. మహాలక్ష్మి, అర్చనలు బయట ఉంటారు. ప్రీతి గెలిచిన క్రెడిట్ నీకే వస్తుందని అర్చన అంటుంది. ఇద్దరూ లేచి నిల్చొంటారు. కానీ ప్రీతి మాత్రం సీత దగ్గరకు వెళ్లి సీతని హగ్ చేసుకొని గెలిచానని చెప్తుంది. ఈ క్రెడిట్ అంతా విద్యాదేవి టీచర్‌దే అని సీత అంటే ప్రీతి మహాలక్ష్మిని వదిలేసి విద్యాదేవి టీచర్ దగ్గరకు పరుగులు తీస్తుంది. మహాలక్ష్మిని ప్రీతి దూరం పెట్టడం తట్టుకోలేకపోతుంది. లెక్క మారుతోందని ఇంట్లో టీచర్ హవా పెరుగుతుందని అర్చన మహాలక్ష్మితో చెప్తుంది. ప్రీతి కప్ పట్టుకొని విద్యాదేవి దగ్గరకు వెళ్లి రెండు చేతులు పట్టుకొని గిరగిరా తిప్పేస్తుంది. తనకు ఫస్ట్ ఫైజ్ వచ్చిందని చెప్తుంది. విద్యాదేవిని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: సత్యభామ సీరియల్: ఫ్యామిలీ వర్సెస్ సత్య.. కిడ్నాప్ విషయం పెళ్లికి ముందే తెలుసన్న క్రిష్ సపోర్ట్‌ ఎవరికో?