Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్కీ జానుకి కాల్ చేసి పక్కనే సంయుక్తకి ఫోన్ ఇవ్వమని అంటుంది. బిజీగా ఉన్నారని జాను చెప్తే ఫోన్‌లో బిజీగా ఉన్నారా అని అడుగుతుంది. లక్ష్మీ మ్యానేజ్ చేస్తుంది. దాంతో జున్ను తల్లిని ఇంటికి రమ్మని పిలుస్తాడు. లక్కీ కూడా సంయుక్తని కలుస్తాను అంటుంది. ఇంటి దగ్గరకు వస్తాను అంటుంది. ఇక ఒక దగ్గర ఆంటీ ఉంటే మరో దగ్గర ఉండరని ఈ రోజు ఎలా అయినా ఇద్దరూ ఒకరే అని నిరూపిస్తానని అంటుంది. మరోవైపు మిత్ర ల్యాప్‌టాప్ చూస్తూ లక్ష్మీ గురించి ఆలోచిస్తూ సంయుక్త, లక్ష్మీ ఇద్దరూ ఒకేలా ఉండటం ఏంటని అనుకుంటాడు. ఇక మనీషా వచ్చి మిత్ర మీద అరుస్తుంది.
మనీషా: ఆ సంయుక్త ఇంట్లో ఉండటం వల్లే కదా డిస్టబెన్స్. తనని వెళ్లిపోమని చెప్తా.
మిత్ర: డిస్టబెన్స్ సంయుక్త ఇంట్లో ఉండటం వల్ల కాదు.
సంయుక్త లక్ష్మీలా ఉండటం వల్ల.
మనీషా: ఓహో సంయుక్త లక్ష్మీని అంతలా గుర్తు చేస్తుందా. తనని చూస్తే లక్ష్మీ గుర్తొస్తుందా.
మిత్ర: మనీషా నేను చెప్పేది ఒకటి నువ్వు అర్థం చేసుకునేది ఒకటి.
జయదేవ్: ఏం జరుగుతుందిరా ఇక్కడ.
మిత్ర: సంయుక్త విషయంలో కన్ఫ్యూజన్ డాడ్.
జయదేవ్: మిత్ర నువ్వు మమల్ని నమ్మకపోయినా పర్లేదు. సంయుక్తని నమ్మకపోయిన పర్లేదు. కానీ మనీషాని నమ్మకపోతే ఎలారా. పాపం మనీషా చూడు. సంయుక్త మనీషాతో కలిసే చదువుకుంది కదా దానికి ప్రూఫ్ కూడా ఉంది కదా. అది కూడా మిత్ర నమ్మకపోతే ఎలా.
మిత్ర: మనీషా చెప్పడం వల్లే తను సంయుక్త అని నేను నమ్ముతున్నా. లేకపోతే తను లక్ష్మీ అనే భ్రమలోనే ఉన్నాను.
మనీషా: ఇదంతా మీ పుణ్యమే ఆంటీ. మీరు సంయుక్త నా ఫ్రెండ్ అని చెప్పడం వల్లే నాకు ఇలాంటి ఇబ్బంది వచ్చి పడింది.
దేవయాని మనీషాని కూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు లక్కీ, జున్నులు అర్జున్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటారు. లక్ష్మీ వస్తుంది. ఇక స్నాక్స్ ఏం చేయాలని లక్ష్మీ అడిగితే లక్కీ ఏం వద్దని అంటుంది. ఇక సంయుక్త అని అచ్చం నీలా ఉందని తనని నువ్వు చూద్దువురా అని పిలుస్తుంది. లక్ష్మీ ఇప్పుడు వద్దలే తర్వాత వస్తాను అంటుంది. తనని డ్రాప్ చేయడానికి పిలుస్తుంది. దానికి లక్ష్మీ సరే అయితే వస్తాను పద అని అంటుంది. వెళ్దాం పద అంటుంది. దాంతో లక్కీ అమ్మే సంయుక్త అయితే రాను అని అంటుంది కదా అని అనుకుంటుంది. ఇక లక్కీ ఇంట్లో అందరికీ వెళ్తాను అని చెప్పి లక్ష్మీని హగ్ చేసుకున్నట్లు తన చేతికి స్టిక్కర్ అతికించి వెళ్లిపోతుంది.
మరోవైపు జయదేవ్, వివేక్ మాట్లాడుకుంటారు. తన తల్లి దేవయానికి తెలీకుండా జానుని ఎలా పెళ్లి చేసుకోవాలా అని అంటాడు. ఇక జయదేవ్ వివేక్‌తో మీ అమ్మని మరిపించేలా నటించాలని చెప్తాడు. కాసేపట్లో లక్ష్మీ వస్తుందని డ్రామా స్టార్ట్ చేయాలని వివేక్కి చెప్తాడు.
ఇంతలో లక్కీ ఇంటికి వస్తుంది. సర్ఫ్రైజ్ ఇస్తానని రెడీ ఉండమని అంటుంది. సంయుక్త, జానులు బ్యాగ్‌లతో వస్తారు. జానుతో లక్ష్మీ చెప్పినట్లు ధైర్యంగా నటించమని అంటుంది.ఇక సంయుక్త దేవయానికి పిలిచి వివేక్ పెళ్లికి షాపింగ్ చేయాలి కదా అని బట్టలు తెచ్చానని అంటుంది. ఇక జాను ఆ షాపింగ్ చేసిందని అంటుంది. దేవయాని షాక్ అయిపోతుంది. తన పద్ధతి మార్చుకున్నానని చెప్పడానికి బట్టలు కొన్నదని చెప్తుంది. జాను మనసు మార్చుకుందని సంయుక్త చెప్తుంది. మిత్ర కూడా ఆశ్చర్యంగా చూస్తాడు. జాను తన ప్రేమని ప్రియుడిని మర్చిపోవాలి అనుకుంటుందని సంయుక్త చెప్తుంది. దేవయాని సంబరపడిపోతుంది. మరోవైపు మనీషాకు అనుమానంగా ఉంటుంది. ఇక వివేక్ కూడా తన డ్రామా మొదలు పెడతాడు. నన్ను పెళ్లి చేసుకుంటావని ఆశ పడితే ఇంత మోసం చేస్తావా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.