Satyabhama Today Episode కోర్టులో క్రిష్‌కి కాళీ సత్యని కిడ్నాప్ చేసి ఒక రోజు అంతా తన దగ్గరే ఉంచేశాడనే విషయం తెలుస్తుంది. దాంతో క్రిష్ షాక్ అయి బాధ పడుతూ ఇంటికి వచ్చేస్తాడు. సత్య తన తండ్రితో కలిసి అత్తింటికి వస్తుంది. సత్యని అత్తమామలు గుమ్మం దగ్గరే ఆపేస్తారు. తన తండ్రిని కొట్టడానికి చేయి ఎత్తిన రుద్రని సత్య ఆపుతుంది. తన తండ్రిని వెళ్లిపోమని విషయం తానే చూసుకుంటానని అంటుంది. సత్యని వదిలి వెళ్లడానికి విశ్వనాథం అంగీకరించడు. 


మహదేవయ్య: ఆపండి.. తోడు దొంగలిద్దరూ కూడబలుకుకొని సింపథీ గేమ్ షురూ చేశారు. మన చెవిలో పువ్వులు పెట్టాలని చూస్తున్నారు. 
భైరవి: తెలుసు పెనిమిటి వాళ్ల లెక్క నేను చదువుకోకపోయినా తెలివి ఉంది. నీ కూతుర్ని తీసుకొని ఈ ఇంటికి వచ్చావ్. నీ కూతురు బాగోతం తెలిసిన అత్తింటి వాళ్లు ఎక్కడ తన్ని తరిమేస్తారేమో అని భయంతో వణుక్కుంటూ వచ్చావ్. అప్పుడు నిజం బయట పడుతుందని భయంతో కాళ్లు కడిగి కూతుర్ని వదిలించుకున్నావ్. ఇప్పుడు నిజం తెలియగానే కనీళ్లతో కాళ్లు కడిగి మరోసారి కూతుర్ని వదిలించుకోవాలని వచ్చావ్ ఒప్పుకో. నువ్వు నిజాన్ని నింద అని నమ్మించాలి  అని చూశావ్.
విశ్వనాథం: అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకోండి.
భైరవి: చీము రక్తం ఉన్నవాళ్లం మాకు బుద్ధి లేదు అనుకుంటున్నావా చెడిపోయిన దాన్ని ఇంట్లో ఎలా పెట్టుకుంటాం అనుకున్నావ్.  


నిశ్చితార్థంలో సత్య క్రిష్‌ని చంపదెబ్బ కొట్టి ఇష్టం లేదు అని చెప్పిందని కొన్ని రోజుల్లోనే క్రిష్‌ని పెళ్లి చేసుకుంటానని నీతో చెప్పించిందని చెడిపోయింది కాబట్టి ఎవరో ఒక బకరాకి ఇచ్చి పెళ్లి చేశారని భైరవి అంటుంది. విశ్వనాథం తప్పుగా మాట్లాడుతున్నారని అనడంతో భైరవి దేవుడి హారతి తెప్పించి పెళ్లికి ముందే కాళీ సత్యని కిడ్నాప్ చేసి ఒక రాత్రి ఉంచుకున్న విషయం నీకు తెలుసా లేదా అని నిజం దాచి పెళ్లి చేశావని ఒట్టు వేయమని అడుగుతుంది. విశ్వనాథం నోట మాట రాక గమ్మునుండిపోతాడు. ఇక తర్వాత విశ్వనాథం ఒట్టు పెట్టి కాళీ తన కూతురి మీద చేయి కూడా వేయలేదని అంటాడు. నమ్మనని భైరవి అంటుంది.  


సత్య: నేను ఈ ఇంట్లో ఉండాలో లేదో తేల్చాల్సింది ఒకే ఒక్కరు అది క్రిష్.
మహదేవయ్య: అంటే ఏంటి ఇప్పుడు చిన్నా కూడా వచ్చి నిన్ను ఛీ కొట్టాలా. రేయ్ క్రిష్.. మహదేవయ్య గన్ పట్టుకొని వస్తాడు. క్రిష్ కిందకి వస్తాడు. రేయ్ ఈడ ఇద్దరు సిగ్గు లేని వాళ్లు వచ్చారు మర్యాదగా పొమ్మంటే పోవడం లేదు. నువ్వు మెడ పట్టుకొని గెంటేయ్. మోసం చేసినవాళ్లని క్షమించడం మన వంశంలోనే లేదురా. నిన్ను మోసం చేసిన వాళ్లు ఎదురుగా ఉన్నారు ఏం చేస్తావో నీ ఇష్టం. నువ్వు ఏం చేసినా కేసు కాకుండా నేను చూసుకుంటా పోరా. 


క్రిష్ కోపంగా గన్ తీసుకొని వెళ్లాడు. సత్య ఎదురుగా నిల్చొని మామయ్య ఎంత సేపు అయింది వచ్చి అని కుశల ప్రశ్నలు అడుగుతాడు. సత్య, విశ్వనాథం సరదా పడతారు. క్రిష్ మామని లోపలికి పిలుస్తాడు. మహదేవయ్య క్రిష్‌ని తిడతాడు. బయటకు పంపమంటే లోపలికి ఎందుకు పిలుస్తావ్‌రా అంటే వాళ్లేం తప్పు చేశారురా అని అంటాడు. కాళీ తనని ఎత్తుకు పోయి ఓ రాత్రి ఉంచుకున్నాడని నిజం దాచి పెళ్లి చేశారని భైరవి క్రిష్‌తో అంటుంది. దానికి క్రిష్ అయితే ఏంటి అని అడుగుతాడు.  


క్రిష్: ఏయ్ ఎందుకు టెన్షన్ పడుతున్నావ్. ఏం తప్పు చేస్తున్నావ్ అని .. కాళీ నిన్ను కిడ్నాప్ చేసిన విషయం పెళ్లికి ముందే నాకు చెప్పావని మా వాళ్లకి ఎందుకు చెప్పడం లేదు. నువ్వు చెప్పేది నిజం అయినా అర్థం చేసుకోరు అని ఆగిపోయావా. లేదంటే ఆ మాట చెప్తే నీ మీద అరుస్తారు అని ఆగిపోయావా. నా కోసం నువ్వు మాట పడటం ఏంటి సంపంగి. ఎందుకు ఇంత త్యాగం నాకు నచ్చలే. నీ వ్యక్తిత్వాన్ని దాచి ఎందుకు ఇంత పని చేస్తున్నావ్. బాపు పెళ్లికి ముందే నాకు సత్య ఈ విషయం చెప్పింది. అది మీకు చెప్పాలి అని నాకు అనిపించలేదు.
భైరవి: రేయ్ అది పోగొట్టుకుంది ఏ దుద్దులో కమ్మలో కాదురా ఆడపిల్ల ఏం పోగొట్టుకోకూడదో అదే పొగొట్టుకుంది.
క్రిష్: అమ్మ సత్య నా భార్య జర మాటలు కాస్త తిన్నగా రానీ.
మహదేవయ్య: మీ అమ్మ ఒక్క మాట అంటే నీకు అంత పౌరుషం మరి రేపు మహదేవయ్య చిన్న కోడలి బాగోతం అని పేపర్లో వస్తే నా సంగతి ఏంటిరా. మన పరువు ఏం కావాలి. నా రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను.
క్రిష్: బాపు ప్రతీ దాన్ని తీసుకెళ్లి నీ రాజకీయ జీవితానికి ముడి పెడతావేంటి. వేరే ఆలోచనే లేదా. 
మహదేవయ్య: ఇన్ని దినాలు నా నీడని బతికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్. ఇప్పటికైనా చేసిన తప్పుని సరిదిద్దుకో.
క్రిష్: నేనేం తప్పు చేయలే.
భైరవి: చెడిపోయిన దాన్ని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా.
క్రిష్: అమ్మ దిగజారి మాట్లాడకు. 


సత్యని ఇంటి నుంచి బయటకు పంపు అని మేం కావాలా అది కావాలా అని మేం కావాలి అనుకుంటే దాన్ని వదిలేయ్ తను కావాలి అంటే మమల్ని వదిలేయ్ అని మహదేవయ్య క్రిష్‌తో అంటాడు. దాంతో క్రిష్‌ సత్య దగ్గరకు వచ్చి సత్యని పెళ్లి చేసుకున్నప్పుడే మాట ఇచ్చానని సత్య తప్పు చేయకుండా మీరు శిక్ష వేస్తున్నారు కాబట్టి ఆ శిక్ష నేను సత్యతో కలిసి అనుభవిస్తానని క్రిష్ అంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: గంటలమ్మని చితక్కొట్టిన హాసిని.. బోనాల ఏర్పాట్లలో తిలోత్తమ ప్లాన్ వర్క్‌ అవుట్ అవుతుందా!