Trinayani Today Episode గంటలమ్మ కళ్లు మంట అని ఆరుబయట కూర్చొని ఉంటే హాసిని గాయత్రీ పాపని తీసుకొచ్చి మాట్లాడకుండా గంటలమ్మ మంత్ర దండంతోనే అమెను చితక్కొడుతుంది. గంటలమ్మ ఎవరు ఎవరు అని అరుస్తుంది. నొప్పితో విలవిల్లాడిపోతుంది. అందరూ బయటకు వచ్చి ఏమైందని అడిగితే గాయత్రీ పాప మంత్రదండంతో తనని కొట్టిందని చెప్తుంది. అందరూ చిన్న పిల్ల మంత్ర దండం ఎలా ఎత్తి కొడుతుందని అంటారు. తిలోత్తమ మాత్రం పాప కొట్టిందని అంటుంది. హాసిని గాయత్రీ పాప నవ్వుకుంటారు. 


హాసిని: రెండేళ్లు కూడా నిండని ఈ పసి కూన ఈ మంత్ర దండంతో గంటలమ్మ గంటలు వాయించింది అంటే మనల్ని చూసి అందరూ నవ్వుతారు.
గంటలమ్మ: ఇందాక నన్ను కొట్టిన దెబ్బలు చూస్తే నయని మీ తోటి కోడలే నన్ను కొట్టింది.
హాసిని: అమ్మో చూశారా ఇందాక పాప కొట్టిందని అంది ఇప్పుడు నా మీద పెడుతుంది. 
విక్రాంత్: అసలు నీ కళ్లు కనిపించకుండా చేసింది ఎవరు గంటలమ్మ
గంటలమ్మ: మీ పెద్దమ్మ గాయత్రీ దేవి. 
సుమన: ఆత్మ రాలేదు వస్తే మా అక్కకి కనిపించలేదు కదా.
గంటలమ్మ: నేను నొప్పితో బాధ పడుతుంటే మీకు ఆటల్లా ఉందా. నేను పోతా.
విశాల్: మా అమ్మని పట్టుకుంటా అన్నావ్.


గంటలమ్మ: మళ్లీ వస్తా. అప్పుడు చెప్తా మీ సంగతి. 
విశాల్: మా అమ్మ ఫొటోకి కట్టిన దారం తీసేయొచ్చా గంటలమ్మ.
గంటలమ్మ: తీసేయండి. మీకు నచ్చింది ఏమైనా చేసుకోండి నేను పోతా 


గంటలమ్మని వల్లభ, తిలోత్తమలు పంపించాలని తీసుకెళ్తారు. ఇక గంటలమ్మని కొట్టింది ఎవరని సుమన అంటే నేనే అని హాసిని ఒప్పుకుంటుంది. మరోవైపు వల్లభ గాయత్రీ దేవి ఫొటో పెట్టుకొని దాన్ని చూస్తూ ఉంటాడు. తిలోత్తమ వచ్చి ఏం చేస్తున్నావ్ అంటుంది. ఇక గంటలమ్మ  ఇంటికి ఎలా వెళ్లిందో ఏంటో అని తిలోత్తమ టెన్షన్ పడుతుంది. ఇక గాయత్రీదేవి కళ్లలో ఏదో మాయ ఉందని వల్లభ అంటాడు. హాసిని, నయని, విశాల్, విక్రాంత్‌లు తిలోత్తమ వల్లభలు గంటలమ్మల గురించి బాధ పడుతున్నారని చెప్తాడు. ఇక నయని సుమన అక్కడికి రావడంతో రేపు బోనాల పండగ ఉందని చెప్తుంది. 


ఉదయం తిలోత్తమ, వల్లభలు ఆరు బయట ఉంటారు. బోనాల ప్రసాదం వండటానికి ఏర్పాట్లు చేస్తుంటారు. తిలోత్తమ, వల్లభను నీరు తీసుకొని రమ్మంటాడు. కర్రలు తడిపేయాలని వల్లభతో చెప్తుంది. దాంతో వల్లభ కట్టెలు తడిపేస్తాడు. ఇక నయని, హాసినిలు ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని వస్తారు. వాళ్లని చూసి విక్రాంత్ అందం అంటే తోటి కోడళ్ల బంధం అని అంటాడు. ఇక హాసిని అక్కడికి రావడంతో నాకు ఒక చీర చూపించి మరో చీర కట్టుకొని వచ్చావని బుంగ మూతి పెట్టుకుంటుంది. ఇక కట్టెలు తీసుకురమ్మని హాసిని అంటే వల్లభ రాజు పని రాజు చేయాలి పనోడి పని పనోడు చేయాలి అంటే తన భర్తని పనోడు అంటావా అని సుమన ఫైర్ అవుతుంది. ఇంతలో ఇంటికి ఓ అజ్ఞాత వ్యక్తి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: ఢిల్లీ రోడ్లుపై జూనియర్ సమంత విన్యాసాలు.. ఎందుకంత ఆనందం అషు!