Karthika Deepam Idi Nava Vasantham Serial Episode నర్శింహ తన కూతురు శౌర్య తనకు కావాలని కోర్టుని ఆశ్రయించి దీపకు నోటీసులు పంపిస్తాడు. తన ఊరి వాళ్లని పిలిచి దీప దగ్గర డబ్బు వసూలు చేయమని అంటాడు. దాంతో ఊరువాళ్లు వచ్చి కార్తీక్, దీపలు లాయర్‌ని కలవడానికి వెళ్తుంటే దీపని ఆపి డబ్బు అడుగుతారు. దాంతో కార్తీక్ దీప ఇవ్వాల్సిన నాలుగు లక్షలు ఇస్తాడు. ఇదంతా చాటుగా చూసిన నర్శింహ దీప, కార్తీక్‌ల వీడియో రికార్డ్ చేస్తాడు. ఇక కార్తీక్ జ్యోతి అనే లాయర్‌ని దీప తరఫున పెడతాడు. కోర్టు సీన్ ప్రారంభమవుతుంది. పారు, జ్యోత్స్నలు కూడా కోర్టుకు వస్తారు. సుమిత్ర పూజ చేస్తూ దీప కోర్టులో గెలవాలి అని తనకు శౌర్య దక్కాలని అలాగే కార్తీక్, జ్యోత్స్నల పెళ్లి అవ్వాలని దేవుడ్ని కోరుకుంటుంది.


నర్శింహ తరపున లాయర్ వీవీ మాట్లాడుతూ కన్నతల్లి బిడ్డను నిర్లక్ష్యం చేస్తుంటే నర్శింహ పాప గురించి తాపత్రయ పడుతున్నాడని అంటారు. వీవీ నర్శింహ భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని దీప గురించి చెప్తాడు. ఇక లాయర్ జ్యోతి వచ్చి నర్శింహని క్రాస్ ఇగ్జామినేషన్ చేస్తుంది.  


జ్యోతి: మీ ప్రాణానికి ప్రాణం అయిన మీ కూతురి పుట్టిన రోజు ఎప్పుడో చెప్పండి. కూతురి కోసం యుద్ధం చేస్తున్నాడని చెప్తున్నారు కదా అంత గొప్ప వ్యక్తికి కూతురి పుట్టిన రోజు కూడా గుర్తు లేదా. కూతుర్ని ప్రేమించే తండ్రికి కూతురి పుట్టిన రోజు కచ్చితంగా గుర్తొండాలి లేదంటే కూతురు ప్రేమ లేనట్లే. 
నర్శింహ: అమ్మ ఎప్పుడో చెప్పిందే ఆ గుర్తొచ్చింది. అని డేట్ చెప్తాడు.  


ఇక దీపని బోనులోకి పిలుస్తారు. ధైర్యంగా మాట్లాడమని కార్తీక్ దీపతో చెప్తాడు. అందరి పేర్లు దీపని అడిగిన వీవీ భర్త పేరు అడిగితే దీప చెప్పదు దాంతో ఆమెకు భర్త మనసులో లేడని కావాలనే భర్తని దూరం పెట్టిందని భర్త బతిమాలినా భర్తని తన వివాహేతర సంబంధం వల్లే ఇదంతా జరిగిందని అంటారు. ఇక జ్యోతి ఆధారాలు అడిగితే వీవీ నర్శింహ దగ్గరకు వెళ్లి నీ భార్యకు నీకు మధ్య ఏం జరిగిందని అడుగుతాడు. తన భార్య తనని వద్దనుకుందని తాను వదులుకోవడం లేదని తనకి తనబిడ్డ కావాలని అడిగితే దీప కొట్టిందని అంటాడు. దీపకు మరో వ్యక్తితో సంబంధం ఉండటం వల్లే తనని దూరం పెట్టిందని నర్శింహ అంటాడు. ఇక కార్తీక్‌ని చూపించి తనతోనే తన భార్య సంబంధం పెట్టుకుందని అంటాడు. దాంతో దీప ఆవేశంగా నర్శింహని కొట్టడానికి వెళ్తే జ్యోతి ఆపేస్తుంది. తన కూతురి అప్లికేషన్ ఫాంలో తన పేరు రాయకుండా తండ్రి స్థానంలో కార్తీక్ పేరు రాశారని చెప్తాడు. అది నిజమో కాదో దీపని అడగమని నర్శింహ అంటాడు. ఇప్పటికి ఆ పేరు అలాగే ఉందని పాపకి స్కూల్ ఫీజు కూడా ఆయనే కట్టాడని నర్శింహ అంటాడు. అప్పు తీసుకున్నానని దీప అంటే నోట్ లేకుండా అంత డబ్బు ఇవ్వడానికి మీ మధ్య సంబంధం ఏంటని లాయర్ అడుగుతాడు. ఇక నర్శింహ దీప అప్పులన్నీ కార్తీకే తీర్చాడని అంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: 'త్రినయని' సీరియల్: గంటలమ్మని చితక్కొట్టిన హాసిని.. బోనాల ఏర్పాట్లలో తిలోత్తమ ప్లాన్ వర్క్‌ అవుట్ అవుతుందా!