Hearing Problems and Their Link to Dementia : వినికిడి లోపమనేది పదాలను అర్థం చేసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అలాగే డిమెన్షియాను పెంచుతుందని చెప్తున్నారు డాక్టర్ ప్రసూన్ ఛటర్జీ. అందుకే వినికిడి సమస్యల ప్రారంభ సంకేతాలను తెలుసుకోవాలంటున్నారు. ఈ సమస్య మెదడు ఆరోగ్యాన్ని నెగిటివ్​గా ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి ముందుగానే ఈ సమస్య లక్షణాలు గుర్తించి.. దానికి తగిన చర్యలు తీసుకుంటే సమస్యను దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. 

వినికిడి లోపం, చిత్తవైకల్యానికి మధ్య సంబంధమిదే

  • మెదడుపై అధికభారంవినికిడి కష్టంగా ఉంటే.. శబ్దాల అర్థం ఏమిటో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇది మెదడును మరింత కష్టపడేలా చేస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాలు దూరమవుతాయి. ఈ ఒత్తిడి వల్ల కాలక్రమేణా మెదడును అలసిపోతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడం కష్టతరం చేస్తుంది. దీనివల్ల డిమెన్షియా వచ్చే ప్రమాదాన్ని పెరుగుతుంది.
  • ఒంటరితనంమీరు సరిగ్గా వినలేకపోతే ఇతరులతో మాట్లాడటం కష్టంగా మారుతుంది. దీనివల్ల సామాజిక కార్యక్రమాలకు వెళ్లడానికి, స్నేహితులను కలవడానికి లేదా ఫోన్‌లో మాట్లాడటానికి మీరు మొగ్గు చూపకపోవచ్చు. దీనివల్ల మెదడు యాక్టివ్​గా ఉండదు. కాలక్రమేణా తక్కువ సమయంలోనే చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఉంది.
  • కుంచించుకుపోవడంతగినంత శబ్దాలు మెదడుకు అందకపోతే.. వినడానికి, గుర్తుంచుకోవడానికి, ఆలోచించడానికి సహాయపడే మెదడులోని భాగాలు నెమ్మదిగా కుంచించుకుపోతాయి. మెదడు కణజాలం కోల్పోవడం వల్ల మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. మీ జ్ఞాపకశక్తిని కోల్పోయి.. చిత్తవైకల్యం వచ్చేలా చేస్తుంది.

తేలికపాటి వినికిడి లోపం చిత్తవైకల్యం వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. మితమైన నష్టం దానిని మూడు రెట్లు పెంచుతుందని.. తీవ్రమైన నష్టం ప్రమాదాన్ని దాదాపు ఐదు రెట్లు పెంచుతుందని చెప్తున్నారు. కాబట్టి మీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ వినికిడిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఇది చిత్తవైకల్యం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని సూచిస్తున్నారు. మరి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలంటే..

మెదడును రక్షించడానికి చేయాల్సిన పనులివే

క్రమం తప్పకుండా వినికిడి పరీక్షలు చేయించుకుంటే సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి. వినికిడి పరికరాలు మీ మెదడుకు విశ్రాంతినిస్తాయి. మిమ్మల్ని సామాజికంగా చురుకుగా ఉంచుతాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం, చురుకుగా ఉండటం, ఒత్తిడిని దూరం చేసుకోవడం, తగినంత నిద్రపోవడం అన్నీ మీ మెదడు ఆరోగ్యానికి మంచివి. ఈ అలవాట్లు మీ జ్ఞాపకశక్తిని కాపాడటానికి, కాలక్రమేణా చిత్తవైకల్యం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.