Healthy Breakfast for Weight Loss : ఏదో అనుకుంటాము కానీ.. దక్షిణాది వంటకాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు చేస్తాయి. ముఖ్యంగా కొన్ని ట్రెడీషనల్ ఫుడ్స్ మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. ప్రతి సౌత్ ఇండియన్ ఉదయాన్నే ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ వంటి టిఫిన్‌తో తమ ఉదయాన్ని స్టార్ట్ చేస్తారు. మరికొందరు ఆరోగ్యం కోసమంటూ.. వీటన్నింటికీ దూరంగా ఉంటారు. అయితే దోశలాంటి ఫుడ్‌తో కూడా బరువు తగ్గవచ్చనే విషయం తెలిస్తే కచ్చితంగా దానిని తమ డైట్లో చేర్చుకుంటారు.
అప్పం. ఇది కేరళలో రెగ్యులర్‌గా చేసుకునే దోశలాంటి వంటకం. దీనిని చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీలో నూనె అస్సలు ఉపయోగించము. కానీ రుచిలో మాత్రం ఇది వివిధ టిఫెన్లకు ఏ మాత్రం తీసిపోదు. దీనిలో బియ్యం, కొబ్బరి, పాలు వినియోగిస్తాము. నూనె అస్సలు ఉపయోగించము. పైగా దీనిని కేవలం ఐదు నిముషాల్లో తయారు చేసుకోవచ్చు. మీరు ఆఫీస్‌కి వెళ్లే రష్లో ఉన్నా.. ఉదయాన్నే మీకు బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం లేకపోయినా మీరు ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. ఈ సింపుల్, టేస్టీ రెసిపీని ఏ విధంగా తయారు చేయవచ్చో.. ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
అటుకులు - 1 కప్పు
రవ్వ - 1 కప్పు
పచ్చికొబ్బరి - అరకప్పు (తురిమినది)
పెరుగు - 1 కప్పు
ఉప్పు - తగినంత
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో అటుకులు, రవ్వ, పచ్చి కొబ్బరి, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. కాస్త నీరు కలిపి పక్కన పెట్టాలి. అది నానెవరకు పక్కన పెట్టేయాలి. ఈ మిశ్రమం బాగా నానిందని మీకు అనిపించిన వెంటనే మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయండి. పిండి మెత్తగా బ్లెండ్ చేసిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు దానిలో ఫ్రూట్ సాల్ట్ వేయండి. ఇది అప్పాలు మెత్తగా, రుచిగా వచ్చేలా సహాయం చేస్తుంది.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ ఉంచండి. అది వేడెక్కిన తర్వాత దానిపై గరిటెతో తయారు చేసుకున్న పిండిని వేయండి. దానిని మీడియం మంట మీద ఉడికించండి. ఇది గోధుమరంగులోకి మారిన తర్వాత తీసేయంది. దీనిని మీకు నచ్చిన చట్నీతో వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా కొత్తిమీర, పల్లీ చట్నీతో దీనిని సర్వ్ చేసుకుంటే అసలే ఇతర బ్రేక్‌ఫాస్ట్ ఏమి అవసరం లేదనిపిస్తాది. ఇంటిల్లిపాదీ హాయిగా లాగించేయవచ్చు.
ఈ రెసిపీలో మనం ఉపయోగించే అటుకులు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. పచ్చికొబ్బరి మీ జుట్టు, చర్మ సంరక్షణలో కీలకంగా వ్యవహరిస్తుంది. పెరుగులోని యాంటీ బయోటిక్స్.. సీజనల్ వ్యాధులు దరిచేరనీయకుండా మిమ్మల్ని రక్షిస్తాయి. దీనిలో ఉపయోగించే ప్రతి పదార్థం మీకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. పైగా కొన్ని కారణాల వల్ల ఆయిల్ ఫుడ్‌కి దూరంగా ఉండేవారికి ఇది మంచి బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. హెల్తీ డైట్ తీసుకునేవారు కూడా దీనిని తమ డైట్లో చేర్చుకోవచ్చు.
Also Read : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?