Saggubiyyam Vada Recipe : మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే.. మీరు మీ ఆహారంలో సగ్గుబియ్యంని కచ్చితంగా చేర్చుకోవాలి. ఎందుకంటే కాల్షియం, ప్రోటీన్స్ కలిగి ఉన్న దీనిని.. మీరు తక్కువగా తీసుకున్నా సరే.. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండే భావన కలిగిస్తుంది. మీరు సంతృప్తిగా ఉంటే.. మీరు అతిగా తినే అవకాశం తగ్గుతుంది. అయితే ఇవి చాలా చప్పగా ఉంటాయి. ఏ రెసిపీలో వాటిని ఉపయోగిస్తే ఆ రుచిని పొందుతాయి. 



సగ్గుబియ్యంని ఎక్కువగా పొంగలి, పాయసం వంటి స్వీట్స్​లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఉదయాన్నే స్వీట్​ తినాలని అనిపించకపోతే.. మీరు సగ్గుబియ్యంతో వడలు ట్రై చేయవచ్చు. రుచికరమైన, క్రిస్పీగా, మృదువుగా ఉండే ముఖ్యంగా ఆరోగ్యానికి కూడా మంచి చేసే ఈ రెసిపీని మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇది ఉదయాన్నే మంచి బ్రేక్​ఫాస్ట్​ అవ్వడమే కాదు.. సాయంత్ర వేళ టీకి మంచి తోడు అవుతుంది. పైగా పిల్లలు నుంచి పెద్దలవరకు అందరూ ఈ రెసిపీని ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ హెల్తీ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


సగ్గుబియ్యం - 1 కప్పు (నానబెట్టుకోవాలి)


వేరుశెనగ - పావు కప్పు (పౌడర్ చేసుకోవాలి)


పచ్చిమిర్చి - 2 (సన్నగా కట్ చేసుకోవాలి)


ఉప్పు - తగినంత


కారం - 1 టేబుల్ స్పూన్


బంగాళదుంపలు - 1 కప్పు (ఉడికించినవి)


కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్​లు


నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్


తయారీ విధానం


ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. పిండిని తయారు చేసుకునేందుకు పెద్దగిన్నె సౌకర్యంగా ఉంటుంది. అనంతరం దానిలో పచ్చిమిర్చి, కారం, ఉప్పు, ఉడికించిన బంగాళదుంపలు, కొత్తిమీర, నిమ్మరసంతో పాటు.. వేరుశెనగలు పౌడర్ వేసి బాగా కలపండి. బంగాళదుంపలు ఉడికించినవే కాబట్టి అవి దుంపలు వలె కాకుండా పూర్తిగా నలిగేలా పిండిని బలంతో కలపాలి. అప్పుడే వడలు మంచి ఆకారాన్ని పొందుతాయి. పైగా పిండిని బాగా కలపడం వల్ల సగ్గుబియ్యానికి మనం వేసుకున్న అన్ని ఫ్లేవర్లు బాగా అందుతాయి.


Also Read : గోధుమపిండితో క్రిస్పీ వెజిటేబుల్ దోశ.. సింపుల్ రెసిపీ


తయారు చేసుకున్న మిశ్రమంతో చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకోవాలి. డీప్​ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేయండి. అది బాగా వేడి అయిన తర్వాత ఈ వడలు దానిలో వేయాలి. మీడియం మంట మీద వాటిని ఉడికించాలి. ఇవి బంగారు గోధుమరంగు వచ్చేవరకు బాగా వేయించాలి. పెరుగుతో పాటు ఈ వడలను మీరు ఆస్వాదించవచ్చు. లేదంటే మీకు నచ్చిన చట్నీతో కూడా వీటిని ఆస్వాదించవచ్చు. 


 Also Read : ఈ జ్యూస్​తో మొటిమలు దూరం.. మెరిసే అందం మీ సొంతం


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.