ICC World Cup 2023: ఐసీసీ టోర్నమెంట్‌లలో న్యూజిలాండ్ జట్టు ఎప్పుడూ విభిన్నంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచకప్‌లో కూడా సరిగ్గా అదే కనిపిస్తోంది. గత రెండు ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్ జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 2019 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీల తేడా కారణంగా ఓడిపోయింది. ఎందుకంటే ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ స్కోరు కూడా సమానంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచకప్‌లో కూడా న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు గట్టి పోటీదారుగా కనిపిస్తోంది.
ఈ ప్రపంచకప్ తొలి మ్యాచ్ కూడా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగింది. న్యూజిలాండ్ అద్భుత విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. ఏకపక్షంగా ఇంగ్లాండ్ జట్టును ఓడించి ప్రపంచకప్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు నెదర్లాండ్స్‌ను, బంగ్లాదేశ్‌ను కూడా ఓడించింది.
ఈ మూడు విజయాల్లో న్యూజిలాండ్ రెండేసి పాయింట్లు సాధించడమే కాకుండా తన నెట్ రన్ రేట్‌ను బాగా మెరుగుపరుచుకుంది. న్యూజిలాండ్ ఈ ప్రపంచ కప్‌లో తన మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు, +1.604 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో నంబర్ వన్‌గా ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఆఫ్ఘనిస్థాన్‌తో న్యూజిలాండ్ తదుపరి మ్యాచ్ ఆడనుంది.
న్యూజిలాండ్ ఎందుకు బలమైన పోటీదారు?
ఈ ప్రపంచకప్‌లో బలమైన పోటీదారులలో ఒకటైన ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ మొదటి మ్యాచ్‌లోనే ఘోరంగా ఓడించింది. రెండో బలమైన పోటీదారు ఆస్ట్రేలియా జట్టు. రెండు ప్రారంభ మ్యాచ్‌లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో నెదర్లాండ్స్ కంటే దిగువన తొమ్మిదో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. గత 20 ఏళ్లలో జరిగిన ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన భారత్ కూడా ప్రపంచ కప్‌లో బలంగా ఉంది. దీనికి తోడు మన సొంత గడ్డపై టోర్నమెంట్ జరుగుతోంది.
ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు అత్యంత ప్రమాదకరమైన జట్టుగా మరోసారి అవతరించినట్లే. గత రెండుసార్లు ఫైనల్స్‌కు చేరిన న్యూజిలాండ్ ఈసారి కూడా ఫైనల్స్‌కు చేరి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవగలదు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial