సాధారణంగా వ్యాయామం చేసే చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. ఎప్పుడు వ్యాయామం చేస్తే మంచిది? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు చేస్తే ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి? ఈ సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం వ్యాయామం చేస్తే
ఉదయం వ్యాయామం చేయడం వల్ల లాభాలు, నష్టాలు ఉంటాయి. కొవ్వు కరుగుతుంది. కండరాల నిర్మాణం జరుగుతుంది. దేహదారుఢ్యం కావాలనుకునే వారు ఉదయం వ్యాయామం చేయాలి. హైబీపీ, డిప్రెషన్ తగ్గాలనుకునే వారు కూడా ఉదయం వ్యాయామం చేస్తే మంచిది. అయితే ఉదయం వ్యాయామం చేయడం వల్ల గాయాల బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే శక్తి స్థాయిలు తక్కువవుతాయి.
సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. ఉదయం వ్యాయామం చేసే వారికి హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. ఇక ఊపిరితిత్తులు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి.
మధ్యాహ్నం వ్యాయామం
మధ్నాహ్నం వ్యాయామం చేసేవారిలో ఏకాగ్రత, శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అస్తవ్యవస్తమైన జీవనశైలి ఉన్నవారికి మేలు జరుగుతుంది. గాయాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ వ్యాయామం ఉద్యోగాలు చేసే వారికి సూట్ అవ్వదు.
సాయంత్రం వ్యాయామం
సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల హైబీపీ తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం మెరుగు పడుతుంది. గాయాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ సాయంత్రం వ్యాయామం వల్ల నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
వర్కవుట్‌కి ముందు తినాలనుకుంటే
* వ్యాయామానికి 2-3 గంటల ముందు తినండి. గుడ్లు, మాంసం, తక్కువ కొవ్వు పాలు, చేపలు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం మర్చిపోవద్దు. మరోవైపు నీటిని కూడా సరిపడా తీసుకోవాలి.
* వ్యాయామం చేయడానికి ముందు మీకు స్వల్ప విరామం మాత్రమే ఉంటే వైట్ బ్రెడ్, ఎనర్జీ బార్స్ లేదా పండ్లు వంటి తేలికైన ఆహారాన్ని ఎంచుకోండి.
* రుతుక్రమం సమయంలో రుతుక్రమం సమయంలో వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పొట్టలో క్రాంప్స్ తగ్గుతాయి.
* జలుబు చేసినప్పుడు ఎక్సర్ సైజ్ చేయవచ్చా ? అంటే ఖచ్చితంగా చేయకూడదని చాలామంది భావిస్తారు. కానీ జలుబుతో బాధపడుతున్నప్పుడు వ్యాయామం చేయడం వల్ల దానికి కారణమయ్యే ఇన్ఫెక్షన్స్ నిరోధించబడి, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఖాళీ కడుపుతో వర్కవుట్ చేస్తే ఆరోగ్య సమస్యలు
* హైపోగ్లైసీమియా (తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు) ప్రమాదాన్ని పెంచుతుంది. మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే... మైకం కమ్మడం, వికారం, వణుకు, మూర్ఛ లాంటివి దరిచేరవచ్చు.
* ఖాళీ కడుపుతో వ్యాయామం చేసే వ్యక్తులు సాధారణంగా ఎక్కువ అలసటతో ఉంటారు. కాబట్టి స్టామినాకు మించి ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల ఉపయోగం ఉండదు.