కప్పుడు రాగి, ఇత్తడి పాత్రల వాడకమే జరిగేది. నీటిని తాగడానికి రాగి పాత్రలే ఉపయోగించే వాళ్ళు. అందులో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. అది నిజం కూడా. నీటిని శుభ్రం చెయ్యడానికి అప్పట్లో ఉన్న ఏకైక మార్గం రాగి పాత్రల్లో నీటిని నిల్వ చెయ్యడమే. కానీ ఇప్పుడు వాటి వినియోగం తగ్గిపోయింది. వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్స్ వచ్చిన తర్వాత వాటి వినియోగం తగ్గిపోయింది. మినరల్ వాటర్ తాగడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ రాగి పాత్రల్లో నీరు తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తహీనత, మూత్రపిండాల సమస్యలు ఏవి రావని వైద్యులు చెప్తున్నారు.


నీరు జీవనాధారం. నీళ్ళు తాగడకుండా జీవించడం అసాధ్యం. అందుకే స్వచ్చమైన నీటిని తాగడం చాలా అవసరం. నీరు శరీరానికి మరింత శక్తిని ఇస్తుంది. రాగి పాత్రల్లో సుమారు 6 నుంచి 8 గంటల పాటు నీటిని నిల్వ చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా నశించిపోతుంది. అప్పుడు అవి ఎటువంటి కలుషితం లేని స్వచ్ఛమైన నీళ్లుగా మారతాయి. వాటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు పెట్టుకుని తాగుతూ ఉంటారు. దానికి బదులుగా రాగి బాటిల్ వాడితే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాగి బాటిల్ లో నీళ్ళు తాగడం వల్ల ఎన్నో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.     


రాగి పాత్రల్లో నీటిని తాగడం వల్ల ప్రయోజనాలు


❄ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో రాగి నీళ్లు సహాయపడతాయి. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం చాలా ముఖ్యం.  సాధారణ ప్యూరిఫైయర్ నీటికి బదులుగా రాగి పాత్రల్లో ఉంచిన నీటిని తాగాలి. ఇది ఆహారాన్ని మరింత ప్రభావవంతంగా జీర్ణం చెయ్యడంలో సహకరిస్తుంది.


❄ కండరాల పనితీరుని మెరుగుపరుస్తుంది.


❄ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడుతుంది.


❄ రక్తపోటుని నియంత్రిస్తుంది.


❄ రాగి పాత్రలో 6 నుంచి 7 గంటల పాటు నీరు నిల్వ చేయడం వల్ల నీటిలోని బ్యాక్టీరియా నశించిపోతుంది. కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపులో ఉన్న ఇబ్బంది తొలగించేందుకు సహకరిస్తుంది. మూత్రపిండాల పనితీరు సక్రమంగా ఉండేలా చూస్తుంది.


❄ కిడ్నీకి సంబంధించిన వ్యాధులను అధిగమించేందుకు రాగి బాటిల్ లో నీళ్ళు తాగడం ఉత్తమం.


❄ ఆహార మార్పుల కారణంగా చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యని ఎదుర్కొంటున్నారు. ఇది ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. వాటి నుంచి రక్షణ పొందాలంటే రాగి పాత్రల్లో నీటిని తాగాలి.


❄ రాగి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రాగి బాటిల్స్ లో నీళ్ళు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.


❄ రాగి మన శరీరానికి చాలా అవసరం. అందుకే మనం తాగే నీటిని రాగి పాత్రల్లో నిల్వ చేయడం రాగి బాటిల్స్తో తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నీళ్ళు శరీరంలోని అదనపు కొవ్వు తగ్గించి బలహీనత రాకుండా నివారిస్తుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంతమంది రాగి పాత్రల్లో వంట చేయడం వాటిని వినియోగించడం చేస్తున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: జుట్టు రాలడానికి కారణాలివే, ఇలా చేస్తే బట్టతల రానేరాదు


Also Read: ఫ్రొజెన్ ఫుడ్ అతిగా తింటున్నారా? అనారోగ్యాన్ని 'కొని' తెచ్చుకున్నట్లే!