బార్లీ బియ్యం ఉడకబెట్టుకుని ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి అనేక పోషకాలు అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతి ముఖ్యమైన ధాన్యం పంటగా బార్లీ పరిగణిస్తారు. అయితే వాటి బియ్యం మాత్రమే కాదు బార్లీ గ్రాస్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బార్లీ గడ్డి ఆరోగ్యకరమైన బరువు తగ్గింపు ఆహారంలో ముఖ్యమైనది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అనేక అధ్యయనాల ప్రకారం బార్లీ గడ్డి పొడి తీసుకుంటే బరువు తగ్గేందుకు సహాయపడుతుందని నిరూపించాయి. ఇందులో సపోనారిన్, గామా అమినోబ్యూట్రిక్ యాసిడ్ (GABA), ట్రిఫ్టోఫాన్ వంటి పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తపోటుని నియంత్రిస్తాయి.


బార్లీ చర్మ ఆరోగ్యం దగ్గర నుంచి నోటి ఆరోగ్యం వరకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తం గడ్డకట్టడం, ఎముకల నిర్మాణం, గుండె ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ కె ఇందులో పుష్కలంగా లభిస్తుంది. బార్లీ గడ్డిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే దీర్ఘకాలిక వ్యాధుల అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి.


బార్లీ గ్రాస్ పౌడర్ ప్రయోజనాలు


నిద్రని ప్రోత్సహిస్తుంది: అధిక GABA, విటమిన్ K,  ట్రిప్టోఫాన్ కంటెంట్‌లతో కూడిన బార్లీ గడ్డి పొడి తీసుకుంటే మంచి నిద్రకు సహాయపడుతుంది. నిద్రను కలిగించే హార్మోన్లు చురుకుగా పని చేయడంలో సహాయపడుతుంది.


యాంటీ డయాబెటిక్: దీని డైటరీ ఫైబర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, బ్లడ్ గ్లూకోజ్ లో గణనీయమైన తగ్గింపులు కలిగిస్తుంది. బార్లీ గ్రాస్ లోని సపోనారిన్ మధుమేహులకు చాలా మేలు చేస్తుంది. షుగర్ లెవల్స్ పెరగకుండా నిరోధిస్తుంది.


రక్తపోటు నియంత్రణ: సపోనారిన్ అనేది బార్లీ గ్రాస్ లో కనిపించే ఫ్లేవనాయిడ్. ఇది రక్తపోటుని నియంత్రించేందుకు శక్తివంతంగా పని చేస్తుంది.


గట్ హెల్త్: బార్లీ గడ్డిలో ప్రీ బయోటిక్ ఫైబర్స్ ఉన్నాయి. ఇవి గట్ లో మంచి బ్యాక్టీరియాని ప్రోత్సహిస్తాయి. జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.


కాలేయాన్ని రక్షిస్తుంది: బార్లీ గడ్డిలో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది నిర్వీషీకరణ లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది. శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.


ఎంజైమ్ యాక్టివేషన్: జీవక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. జీర్ణక్రియకి తోడ్పడే ఎంజైమ్ లు కలిగి ఉంటుంది. పోషకాల శోషణ, మొత్తం జీర్ణక్రియకి సహాయపడుతుంది.


యాంటీ ఇన్ఫ్లమేటరీ: బార్లీ గడ్డిలో యాంటీ ఇంఫలామేతయారీ లక్షణాలు ఉన్నాయి. ఇవి పేగు గోడలకు ఉన్న గాయాలని నయం చేస్తుంది. జీర్ణాశయాంతర పేగు రుగ్మతలు, ప్యాంక్రియాటైటిస్, అల్సర్ వంటి చికిత్సకు ఈ పొడిని ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ పొడి తరచూ తీసుకోవడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.


ఆల్కలైజింగ్ లక్షణాలు: బార్లీ గడ్డి శరీరంపై ఆల్కలైజింగ్ ప్రభావాలని కలిగి ఉంటుంది. pH సమతుల్యని కాపాడుతుంది. శరీరంలోని యాసిడ్స్, ఆమ్లత్వానని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.


ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే బార్లీ గడ్డి పొడి తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం తప్పని సరి. లేదంటే మీకున్న వ్యాధులని ఇది తీవ్రతరం చేసే అవకాశం ఉంది.


Also Read: పప్పు ఉడికించేటప్పుడు నురుగు లాంటిది ఎందుకు వస్తుంది? అది హానికరమా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial