Horoscope Today (జూన్ 28 రాశిఫలాలు): ఈ రోజు ( జూన్ 28న) మేషం, సింహరాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారు ఇంటి అవసరాలను నిర్లక్ష్యం చేయకండి. కన్యా రాశి వారు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతారు.


మేష రాశి
ఈ రాశివారికి వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఈ రోజు పై అధికారుల మద్దతు లభిస్తుంది. బిల్డర్లు తమ ప్రాజెక్టులపై నమ్మకంగా ఉంటారు. అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతులు పరస్పరం అంగీకారంతో ఉంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు.


వృషభ రాశి
మీ జీవన శైలి మెరుగుపడుతుంది. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టు లభిస్తుంది. సహోద్యోగి తప్పు చేస్తే వారు చేసిన తప్పును అర్థమయ్యేలా చెప్పండి. ఇంటి అవసరాలను విస్మరించవద్దు. మీరు ఏకాగ్రతతో కష్టపడి పనిచేస్తే, కచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల ఆప్యాయత పెరుగుతుంది.


మిథున రాశి
ఈ రాశి ఉద్యోగులకు మీకు పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశం రావొచ్చు. రోగ నిరోధక శక్తి పెరగాలంటే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పరస్పర సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో మీ దృష్టి ఉంటుంది.  మీ మనస్సుపై భారం తగ్గుతుంది. టెన్షన్ తగ్గుతుంది. ఇంటి బాధ్యత పెరుగుతుంది


కర్కాటక రాశి 
ఈ రోజు మీరు పుస్తక పఠనంలో సమయాన్ని గడుపుతారు. హంగు, ఆడంబరాల వ్యవహారంలో సంయమనం పాటించండి. మీ అంతట మీరే  నలుగురి మధ్య కలిసేందుకు ప్రయత్నించాలి. వారు మీ మనోధైర్యాన్ని పెంచుతారు. మీ పురోగతి గురించి ఆందోళన వద్దు . ఉద్యోగులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడుపుతారు.


సింహ రాశి 
ఈ రాశివారి వైవాహిక సంబంధాలలో చాలా అన్యోన్యత ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల చదువులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి.


Also Read: చాతుర్మాస్య దీక్ష అంటే ఏంటి - నియమాలేంటి - ఎవరైనా చేయొచ్చా!


కన్యా రాశి
మీకిష్టంలేని వ్యక్తులను కలవడం వల్ల కోపం పెరుగుతుంది. మీరు లక్ష్యాలపై అవగాహన కలిగి ఉండాలి. బ్యాంకింగ్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులుకు వర్క్ ఎక్కువ ఉంటుంది. ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. సకాలంలో పనులు చేయకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతారు. రోజంతా చాలా బిజీగా ఉంటారు.


తులా రాశి
ఈ రాశి ఉద్యోగులు పనికి ప్రశంసలు అందుకుంటారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు.  మీరు సామాజిక కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. కానీ అభద్రతతో గందరగోళం చెందకండి. ఈరోజు ఏ విషయంలోనైనా ఓటమిని మీ కృషితో గెలుపుగా మార్చుకుంటారు. ఈరోజు మీకు ఇష్టమైన వస్తువును పొందవచ్చు.  ప్రియమైన వారి నుంచి బహుమతులు పొందే అవకాశం ఉంది.


వృశ్చిక రాశి
ఈ రోజు మీరు డబ్బు విషయంలో నిరాశ చెందుతారు. ఆత్మపరిశీలన , విశ్లేషణలో సమయాన్ని వెచ్చించండి. ప్రియమైన వారి పట్ల మీ ప్రవర్తనను చక్కగా ఉంచుకోండి. పనికిరాని పనుల్లో మీ సమయాన్ని వృథా చేయవద్దు. సంభాషణ ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి.


ధనుస్సు రాశి
ఈ రాశివారు చాలా ఆనందంగా ఉంటారు.  కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఆనందంగా గడుపుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రజలు మీ సలహాను పాటిస్తారు.


Also Read: ఈ వారం ఈ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ సమయం, జూన్ 26 నుంచి జూలై 2 వారఫలాలు


మకరరాశి
గ్రహ స్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులకు అనుకూలమైన రోజు. మీ సంకల్ప బలంతో శక్తి కి మించి కష్టపడతారు. మీరు ప్రజల్లో స్ఫూర్తిదాయకంగా ఎదగగలరు. మీరు ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచించవచ్చు. పాత ఆలోచనలను విస్మరించి కొత్త ఆలోచనలను అలవర్చుకోండి. న్యాయపరమైన విషయాల్లో విజయం ఉంటుంది.


కుంభ రాశి
బహుళజాతి కంపెనీలలో పనిచేసే వ్యక్తులు బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు. పెద్ద సమావేశానికి హాజరవుతారు. పిల్లలతో సమయం స్పెండ్ చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామ్య పనులు కలిసొస్తాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అనువైన సమయం నైతిక విద్యను అందిస్తారు. మీరు దేవుడిని ఆరాధించడానికి , ఆధ్యాత్మిక ఆలోచనలకి సమయం ఇవ్వరు. భాగస్వామ్య పనులకు మంచి అనుకూల సమయం.


మీనరాశి
కుటుంబ విషయాలలో బయటి వ్యక్తుల అభిప్రాయం తీసుకోకండి. ఓపికతో, విచక్షణతో పనిచేయడం చాలా ముఖ్యం. మీరు విపత్కర పరిస్థితిలో చిక్కుకుపోవచ్చు. మీ బాధ్యతలను సరిచేసుకోవడానికి ప్రయత్నించండి. జనంలోకి వెళ్లే అవసరం లేదు.