కొంతమంది సాధారణ తలనొప్పికి మైగ్రేన్‌గా భావిస్తారు. మైగ్రేన్ నొప్పిని సాధారణ తలనొప్పే కదా అని తేలిగ్గా తీసుకుంటారు. పైగా దాన్ని గుర్తించలేరు కూడా. అలాగే, తలనొప్పి ఒకొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో సాధారణ తలనొప్పే మైగ్రేన్‌గా మారుతుంది.
మైగ్రేన్ అంటే ఏమిటి?: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్ అండ్ స్ట్రోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మైగ్రేన్ తలనొప్పి అనేది తలలోని ఒక వైపు లేదా ఒక భాగంలో మాత్రమే ఏర్పడుతుంది. మెదడులోని జన్యు ఉత్పరివర్తనాల వల్ల నాడీ వ్యవస్థతో అలజడి నెలకొంటుంది. అదే నొప్పికి ప్రేరేపిస్తుంది. మైగ్రేన్ నొప్పి వచ్చినట్లయితే తప్పకుండా మీరు వైద్యుడిని సంప్రదించాలి. అది సాధారణ తలనొప్పా? లేదా మైగ్రేన్ తలనొప్పా అనేది ముందుగా తెలుసుకోవాలి. ఈ కింది లక్షణాలు మీలో కనిపించినట్లయితే.. అది తప్పకుండా మైగ్రేన్ వల్ల ఏర్పడే నొప్పే. అవేంటో చూసేయండి మరి.
- నిద్రలేమి సమస్య: మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు నిద్రలేమి సమస్యతో బాధపడతారు. వారికి సరిగ్గా నిద్రపట్టదు. పూర్తిగా నిద్రపోవడానికి ఇబ్బంది పడతారు. నిద్రలేమి సమస్య మైగ్రేన్‌కు మొదటి లక్షణంగా భావించవచ్చు.
- బలహీనంగా అనిపించడం: మైగ్రేన్‌తో బాధపడే వ్యక్తులు బలహీనతతో బాధపడతారు. శరీరం యొక్క ఒక వైపు తిమ్మిరిగా అనిపిస్తుంది. ఒళ్లు జలదరించినట్లుగా ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.
- మెరిసే లైట్లు లేదా ఫ్లాష్ లైట్లను చూడలేరు: ఎక్కువ కాంతిని చూడటానికి ఇబ్బందిపడతారు. అలాగే కళ్లలో ఏవో మెరుపులు వచ్చినట్లు ఉంటుంది. కళ్లల్లో కొన్ని రకాల రంగులు లేదా, జిగ్ జాగ్ లైన్లు ఏర్పడతాయి. సైనస్, టెన్షన్ లేదా సాధారణ తలనొప్పిలో ఇలాంటి లక్షణాలు కనిపించవు.
- గందరగోళం: మైగ్రేన్ సమస్యతో బాధపడేవారికి తలనొప్పి మాత్రమే కాదు. గందరగోళాన్ని కూడా అనుభవిస్తారు. మెదడులో మబ్బులు కమ్మిన ఫీలింగ్ కలుగుతుంది. ఏకాగ్రత, ఆలోచన శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది.
- మెడ నుంచి తల వరకు నొప్పి: మైగ్రేన్ ఏర్పడినప్పుడు మెడ నుంచి తల వరకు విపరీతమైన నొప్పి ఉంటుంది. దాని వల్ల మీరు మెదడును సులభంగా కదిలించలేరు. చాలా నొప్పిగా చురుక్కు అన్నట్లుగా నొప్పి వస్తుంది. పై సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స పొందండి.
Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు
గమనిక: పై వివరాలను కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఈ సూచనలు చికిత్సకు గానీ, వైద్యుల సూచనలకు గానీ ప్రత్యామ్నాయం కాదు. వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు, హెల్త్ కథనాల్లోని అంశాలను ఈ సమాచారంలో యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.