Oppo Reno 8 Lite 5G: ఒప్పో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. అదే ఒప్పో రెనో 8 లైట్ 5జీ.

Continues below advertisement

ఒప్పో రెనో 8 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ స్పెయిన్‌లో లాంచ్ అయింది. మనదేశంలో లాంచ్ అయిన ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌కి పలు మార్పులు చేసి రెనో 8 లైట్ 5జీగా మార్కెట్లోకి తీసుకువచ్చారు. 60 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి.

Continues below advertisement

ఒప్పో రెనో 8 లైట్ 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 429 యూరోలుగా (సుమారు రూ.35,700) అందించారు. బ్లాక్, రెయిన్ బో కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఒప్పో రెనో 8 లైట్ 5జీ మనదేశంలో లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు.

ఒప్పో రెనో 8 లైట్ 5జీ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

5జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా... 33W సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీని మందం 0.75 సెంటీమీటర్లు కాగా... బరువు 173 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Continues below advertisement
Sponsored Links by Taboola