Gaming Disorder: గేమింగ్ డిజార్డర్ ఉందా? అయితే జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది జాగ్రత్త

గేమింగ్ డిజార్డర్ ఇప్పుడు ఎక్కువ మంది యువతను వేధిస్తున్న సమస్య.

Continues below advertisement

కరోనా వచ్చాక ఎక్కువ మంది ఇళ్లకే అప్పట్లో పరిమితమయ్యారు. రెండు మూడేళ్ల పాటు వర్క్ ఫ్రం హోమ్ చేశారు. యువత కాలేజీలకు వెళ్లకుండా ఇంట్లోనే ఎక్కువ సేపు ఉండిపోయారు. ఆ సమయంలోనే ఆన్ లైన్ గేమింగ్‌కు అలవాటు పడ్డారు. ఈ ఆన్‌లైన్ గేమింగ్ ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంది. చాలామంది వ్యక్తులు పిల్లలు వీడియో గేమింగ్, మొబైల్ గేమ్‌లకు బానిసలుగా మారినట్టు సర్వేలు చెబుతున్నాయి. వీరంతా గేమింగ్ డిజార్డర్ బారిన పడినట్టే. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

Continues below advertisement

రాజస్థాన్లోని అల్వార్‌కు చెందిన ఒక యువకుడు గేమింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. అతనిలో విపరీతమైన లక్షణాలను కనిపించాయి. అతడు వణుకుతూ ఉన్నాడు. జ్ఞాపకశక్తి కూడా తక్కువగానే ఉంది. తను ఆన్ లైన్‌లో మొబైల్లో గేమ్స్ ఆడకుండా ఉండలేకపోతున్నాడు. వాటి వల్లే చేతులు వణికిపోవడం వంటి సమస్యలు మొదలయ్యాయి. గేమింగ్ డిజార్డర్ బారిన పడిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వారి చేతులు వణుకుతూ ఉంటాయి. విషయాలు గుర్తు పెట్టుకోలేరు. చిరాకు పడుతూ ఉంటారు. ఆకలి వేయదు. ఏ విషయంపైనా ఏకాగ్రత కుదరదు. మానసిక ఆందోళన బారిన పడినట్లు కనిపిస్తారు. డిప్రెషన్ గా కూడా అనిపిస్తుంది. వారు ఏ క్షణం ఏం చేస్తారో అంచనా వేయడం కష్టం. ఇలాంటి లక్షణాలు  అధికంగా ఆన్ లైన్ గేమ్స్, మొబైల్ గేమ్స్ ఆడే వారిలో కనిపిస్తాయి.

పబ్ జి వంటి గేములు ఎంతోమంది టీనేజర్లను, పిల్లలను బానిసలుగా చేసుకున్నాయి. వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇలా ఎక్కువసేపు గేమ్స్ ఆడటం వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. లేకుంటే వారి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. కోపం పెరిగిపోతుంది. ఏ విషయాన్ని అంత త్వరగా అంగీకరించరు. చదువు కూడా కుంటుపడుతుంది. కాబట్టి పిల్లలను, యువతను మొబైల్ గేమ్స్, ఆన్ లైన్ గేమ్స్ కు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. గేమింగ్ డిజార్డర్ వల్ల మానసికంగా వారిలో ఎన్నో మార్పులు వస్తాయి. తీవ్ర ఒత్తిడికి గురవుతారు. చదువు రాక ఇబ్బంది పడతారు. వారిలో కోపాన్ని పెంచేస్తుంది. అకారణంగా కోపం, అసహనం  చూపిస్తారు. కాబట్టి ముందే జాగ్రత్త పడాలి.  గేమింగ్ డిజార్డర్ బారిన పడిన వారు చదువులో వెనకబడే అవకాశం ఎక్కువ.

Also read: వేపాకులతో ఇలా చేస్తే అందంతో పాటు ఎంతో ఆరోగ్యం కూడా

Also read: అధిక బరువుతో బాధపడుతున్నవారు థైరాయిడ్ క్యాన్సర్ బారిన సులువుగా పడతారా?

Also read: వర్షాకాలంలో మైగ్రేన్ తలనొప్పి వేధిస్తోందా? ఈ ఆయుర్వేద మందులను వాడండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Continues below advertisement